AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడే పుట్టిన శిశువుకు వింత వ్యాధి.. ముఖం చూస్తే ముద్దులొలికే రూపం..! కానీ, ఒళ్లంతా తాబేలు ఆకారం..

నిద్రపోవాలంటే కూడా సరిగా పడుకోలేక అవస్థ పడేవాడని చెప్పారు. ఈ అరుదైన వ్యాధిని నయం చేయడానికి శిశువుకు రెండు పెద్ద శస్త్రచికిత్సలు చేయించారట. మొదటిది ఆరు నెలల వయస్సులో ఉన్నప్పుడు, రెండవది మూడు నెలల తర్వాత చేశారు. రెండు ఆపరేషన్ల ద్వారా అతడి ఒంటిపై పేరుకుపోయిన..

అప్పుడే పుట్టిన శిశువుకు వింత వ్యాధి.. ముఖం చూస్తే ముద్దులొలికే రూపం..! కానీ, ఒళ్లంతా తాబేలు ఆకారం..
Baby
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2023 | 6:29 PM

Share

కాలం మారుతున్నా కొద్దీ మనుషుల్లో రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మరో వింత వ్యాధి వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన శిశు వీపుపై వింత పొర కనిపించింది. శిశువు శరీరంపై తాబేలు వంటి గట్టి పొరను చూసిన వైద్యులు, తల్లిదండ్రులు తొలుత షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఆ బాలుడికి తల్లిదండ్రులు లిటిల్ నింజా తాబేలు అని పేరు పెట్టుకున్నారు. ఫ్లోరిడాలో అరుదైన చర్మవ్యాధి కారణంగా పెంకుతో జన్మించిన శిశువు అందరినీ కలవరపెట్టింది. ఫ్లోరిడాలోని క్లియర్‌వాటర్‌కు చెందిన జేమ్స్ మెక్‌కలమ్ అనే పిల్లవాడు ఈ సమస్యతో జన్మించాడు. మెలనోసైటిక్ నెవస్ (melanocytic nevus) అని పిలువబడే అరుదైన వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఇది చర్మంపై అసాధారణంగా నల్లటి పాచ్‌ను కలిగి ఉంటుంది. పాప శరీరంపై ఇలాంటి పెంకును చూసిన తల్లిదండ్రులు అతనికి లిటిల్ నింజా తాబేలు అని పేరు పెట్టారు.

అయితే, జేమ్స్ తల్లిదండ్రులు మొదట బేబీ వీపుపై ఉన్న పెంకు పుట్టుమచ్చగా భావించారు. కానీ, ఆ బిడ్డకు రెండేళ్లు వచ్చేసరికి అది మరింత పెరిగింది. ఇది మందపాటి కణితి రూపంలోకి మారింది. వీపుపై మందపాటి పెంకు ఉండటంతో అతన్ని పడుకోబెట్టడం కూడా సాధ్యం కాలేదని చెప్పారు. స్కాబ్ పెరుగుదల దశలో బాలుడు దురదతో బాధపడినట్టుగా చెప్పారు. నిద్రపోవాలంటే కూడా సరిగా పడుకోలేక అవస్థ పడేవాడని చెప్పారు. ఈ అరుదైన వ్యాధిని నయం చేయడానికి శిశువుకు రెండు పెద్ద శస్త్రచికిత్సలు చేయించారట. మొదటిది ఆరు నెలల వయస్సులో ఉన్నప్పుడు, రెండవది మూడు నెలల తర్వాత చేశారు. రెండు ఆపరేషన్ల ద్వారా అతడి ఒంటిపై పేరుకుపోయిన పెంకును చాలా తొలగించారు. ఆ భాగంలో చర్మంతో భర్తీ చేశారు.

Little Ninja Turtle

Little Ninja Turtle

ఆపరేషన్‌ తర్వాత బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. జేమ్స్ ఇప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా హాయిగా నిద్రపోతున్నాడని తల్లిదండ్రులు చెప్పారు. ఆగస్టులో బాలుడి రెండవ పుట్టినరోజు నాటికి వైద్యులు వ్యాధిని పూర్తిగా నయం చేస్తారని జేమ్స్ తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..