AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Temple: అయోధ్య రాముడు కొలువుదీరే ముహూర్తం..! ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ.. ఇవీ పూర్తి వివరాలు

సాలిగ్రామాలతో రాముడు, సీత విగ్రహాలను చెక్కనున్నారు. ఇందుకోసం నేపాల్ నుంచి ప్రత్యేక శిలల్ని తెప్పించారు. గండకి నదీ తీరంలో వీటిని గుర్తించి తీసుకొచ్చారు. ఈ శిలలకు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు భావిస్తున్నారు. శ్రీ రాముడి విగ్రహం తయారయ్యాక..స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణపతిష్ఠ చేయనున్నారు.

Ayodhya Ram Temple: అయోధ్య రాముడు కొలువుదీరే ముహూర్తం..! ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ.. ఇవీ పూర్తి వివరాలు
Rammandir Inauguration Date
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2023 | 4:15 PM

Share

అయోధ్యలో తలపెట్టిన శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండో అంతస్తు పనులు, చెక్కడాల పనులు జరుగుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిర ప్రారంభోత్సవానికి కన్నడిగులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రామ్‌లల్లా ప్రతిష్టాపనకు డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది. జనవరిలోనే ఆలయ సందర్శనకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే…అప్పటికీ కొంత మేర పనులు మిగిలి ఉంటాయని, భక్తులకు అనుమతినిస్తూనే ఆ పనులు కొనసాగిస్తామని ట్రస్ట్ వెల్లడించింది.

అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్లాట్ ఫాం నిర్మించారు, పిల్లర్లు నిలబెట్టి గోడ నిర్మించారు. తోరణాలు సిద్ధంచేశారు. ఇక శిలాఫలకం పనులు చివరి దశలో ఉన్నాయని రామాలయ నిర్మాణ ధర్మకర్త పెజావర్‌మఠం శ్రీ విశ్వప్రసన్న తీర్థ శ్రీ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు..సాలిగ్రామాలతో రాముడు, సీత విగ్రహాలను చెక్కనున్నారు. ఇందుకోసం నేపాల్ నుంచి ప్రత్యేక శిలల్ని తెప్పించారు. గండకి నదీ తీరంలో వీటిని గుర్తించి తీసుకొచ్చారు. ఈ శిలలకు 6 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు భావిస్తున్నారు.

శ్రీ రాముడి విగ్రహం తయారయ్యాక..స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణపతిష్ఠ చేయనున్నారు. ఇదే విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇవి మూడు రెట్లు పెరిగాయి. ఈ క్రమంలో రామ భక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో శతాబ్దాల తర్వాత మళ్లీ అయోధ్యలో శ్రీరాముడు రాజ్యమేలబోతున్నాడంటూ భక్తులు సంబరపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..