AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్న చత్తీస్‌ఘడ్‌ నేడు మరోటి.. మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి.. మూడు నెలల్లో 12 పేలుళ్లు..

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్స్ నిత్యం కూంబింగ్ చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు పోలీసులను ప్రతిఘటించేందుకు మందు పాతరలు అమర్చుతున్నారు. పాందు పాతరల కారణంగా మూగ జీవాలతో పాటు అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది వికలాంగులుగా మారారు.

నిన్న చత్తీస్‌ఘడ్‌ నేడు మరోటి.. మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి.. మూడు నెలల్లో 12 పేలుళ్లు..
Ied Bomb Blast
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2023 | 5:38 PM

Share

మరోమారు మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. ఏప్రిల్ 26న చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లా అరన్‌పూర్‌లో మావోయిప్టులు మందుపాతర పేల్చిన ఘటనలో 11 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన మరువక ముందే.. జార్ఖండ్‌లో భారీ పేలుడుకు తలపడ్డారు. జార్ఖండ్‌లోని కొల్హన్ డివిజన్‌లోని సరందాలో నక్సలైట్ల పేలుడులో గంగి సూరిన్ అనే అమాయక మహిళ ప్రాణాలు కోల్పోయింది. నక్సల్స్ రహిత జార్ఖండ్‌ను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తున్న భద్రతా దళాలను మట్టుబెట్టుందుకు నక్సల్స్‌ దారుణానికి ఒడిగట్టారు. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని అడవులలో పెద్ద ఎత్తున IED బాంబులను అమర్చారు. ఇప్పటివరకు పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో డజన్ల కొద్దీ ఐఇడి బాంబు పేలుళ్లు చోటు చేసుకోగా,శుక్రవారం మరోసారి నక్సలైట్లు అమర్చిన ఐఇడి బాంబు పేలింది. అడవిలో కలపను సేకరించేందుకు వెళ్లిన వృద్ధురాలు ఈ ఘటనలో మృతి చెందింది. ఐఈడీ బాంబు పేలుడులో వృద్ధురాలు మృతి చెందిందన్న వార్త గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది.

మృతురాలు గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాహటు నివాసిగా గుర్తించారు. కోల్హాన్ డివిజన్‌లోని అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాల్లో నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో ఆమె అటుగా వెళ్లడంతో చనిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన బాంబుల వల్ల ఏడుగురు అమాయక గ్రామస్థులు చనిపోయారు.

జార్ఖండ్‌లో గత మూడు నెలల్లో సుమారు 12 మందుపాతర పేలుళ్ల సంఘటనలు జరిగాయని తెలిసింది. ఇదంతా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్స్ నిత్యం కూంబింగ్ చేస్తున్నారు. దీంతో మావోయిస్టులు పోలీసులను ప్రతిఘటించేందుకు మందు పాతరలు అమర్చుతున్నారు. పాందు పాతరల కారణంగా మూగ జీవాలతో పాటు అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది వికలాంగులుగా మారారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..