AYUSH: ఆయుర్వేదం మన జీవన విధానం.. ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ స్ఫూర్తితో ఆయుర్వేదిక్ సైన్సెస్ జర్నల్..
ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'లో అందించిన స్ఫూర్తితో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందుకు కదులుతోంది. ఆయుర్వేదాన్ని అవలంబించాలని.. ఆయుర్వేద జీవన విధానాన్ని వారి జీవనశైలిలో చేర్చుకోవాలని..
ఆయుష్ మంత్రిత్వ శాఖ మరో ముందడుగు వేసింది. ఈ రంగంపై ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ప్రభావంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఓ జర్నల్‌ను ప్రారంభించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), ఆయుర్వేదిక్ సైన్సెస్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ (జేఆర్ఏఎస్) అధికారిక పరిశోధన ప్రచురణ ప్రత్యేక సంచికను తీసుకొచ్చింది. ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారుల సమక్షంలో జర్నల్ ప్రత్యేక సంచికను ప్రారంభించారు.
సర్బానంద సోనోవాల్ తన ప్రసంగంలో ఈ వివరాలను వెళ్లడించారు. భారతీయుల్లో ఆయుష్‌పై సానుకూల విశ్వాసం కల్పించడంలో ప్రధానమంత్రి ‘ మన్ కీ బాత్ ‘ సంభాషణలు కీలకంగా మారాయి. దాని వినూత్నమైన, ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ స్టైల్ ప్రెజెంటేషన్‌తో.. ఈ రేడియో ప్రోగ్రామ్ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. అన్ని కమ్యూనిటీల మధ్య ప్రజాదరణ పొందింది. ఈ ప్రత్యేక సంచిక కంటెంట్ ఆయుష్ రంగంపై మన ప్రధానమంత్రి మోదీ వివిధ ఆలోచనల నుంచి ప్రేరణ పొందింది.
దాదాపు 37 ‘ మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లలో ఆయుష్ ప్రస్తావన ఉంది. పౌరులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, యోగాను అభ్యసించాలని, సాక్ష్యం ఆధారిత ఆయుర్వేదాన్ని అవలంబించాలని.. ఆయుర్వేద జీవన విధానాన్ని వారి జీవనశైలిలో చేర్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పౌరులను కోరారు. ఆయుష్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి చేసిన కృషి ఫలితంగా.. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సాంప్రదాయ భారతీయ వైద్య విధానాల ప్రయోజనాల గురించి అవగాహన పెరిగింది.
జర్నల్ ప్రత్యేక సంచిక కంటెంట్ గత 9 సంవత్సరాలలో ఆయుష్ వ్యవస్థలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వివిధ సంభాషణల నుంచి ప్రేరణ పొందింది. ఇది ఆయుష్ రంగంపై ‘ మన్ కీ బాత్ ‘ ప్రభావం, దేశ జాతీయ ఆరోగ్య విధానం, ఆరోగ్య సమస్యలపై ఆయుష్ ఎలా ఒక ప్రాథమిక స్తంభంగా మారుతుందో తెలియజేస్తుంది.
పాలసీ అండ్ పబ్లిక్ హెల్త్, సైన్స్ అండ్ ఎవిడెన్స్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్, యోగా అండ్ స్వస్థవృత్తా (జీవనశైలి, వ్యాయామం, ఆహారం, పోషకాహారం), కరోనాపై పోరాటం, ఇండస్ట్రియల్ అండ్ అకాడెమియా వంటి 7 సంబంధిత రంగాలపై మొత్తం 24 ప్రసిద్ధ నిపుణుల కథనాలను ప్రచూరించడం జరిగింది.
ఈ ప్రత్యేక సంచికలో ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ ప్రత్యేక సందేశం ఇందులో ఉంది. వీరితోపాటు ఆయుర్వేదంలోని ప్రముఖుల ప్రత్యేక విశ్లేషనలను ఇందులో పొందుపరిచారు. అంతే కాకుండా వైద్య రాజేష్ కోటేచా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, విద్యావేత్తలు, పతంజలికి చెందిన ఆచార్య బాలకృష్ణ, ఇమామీకి చెందిన డాక్టర్ సికె కతియార్, సిఎస్‌ఐఆర్‌కి చెందిన డాక్టర్ విశ్వజనని సత్తిగేరి- TKDL, వైద్యులు ఈ సంచిక ప్రచూరణకు సహకరించారని ఆయుష్ విభాగం తెలిపింది.
అయితే, ఈ జర్నల్ త్రైమాసికంలో ప్రచురించబడుతుంది.. అంటే మూడు నెలలకు ఓ సారి ఈ పత్రిక మార్కెట్లోకి వస్తుంది. ప్రింట్, ఆన్‌లైన్ ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇంటర్ డిసిప్లినరీ హెల్త్ సైన్సెస్‌తో సహా ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, సిద్ధ, హోమియోపతి రంగాలలో పరిశోధనలను ప్రచురించడానికి బహుళ విభాగాల వేదిక. జర్నల్‌ను మెడ్‌క్నో ప్రచురించింది, ఇది వోల్టర్స్ క్లూవర్ హెల్త్‌లో భాగమైంది, ప్రపంచవ్యాప్తంగా 450 కంటే ఎక్కువ మెడికల్ జర్నల్‌లతో దాని పోర్ట్‌ఫోలియోలో అతిపెద్ద ఓపెన్ యాక్సెస్ పబ్లిషర్‌లలో ఒకటి.
మరిన్ని జాతీయ వార్తల కోసం