Viral News: ఇదేం కండీషన్ సామీ..! ఇళ్లు అద్దెకు కావాలంటే ఈ క్వాలిఫికేషన్ తప్పనిసరి..!
ఇల్లు అద్దెకు కావాలని అడిగిన వ్యక్తికి 12వ తరగతిలో 90 శాతం మార్కులు రాకపోవడంతో ఫ్లాట్ అద్దెకు ఇవ్వనన్నాడని చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే తన మిత్రుడికి కేవలం 75 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. చేసేది లేక అతను విషయం తన మిత్రుడికి చెప్పాడు. మన మార్కులు భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియదు కానీ.. అద్దెకు ఫ్లాట్ దొరికేదీ లేనిదీ కచ్చితంగా నిర్ణయిస్తాయని చివర్లో చమత్కరిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు.
నగరాల్లో అందుబాటు ధరల్లో ఇల్లు అద్దెకు దొరకాలంటే కష్టమే. ఇక ఐటీ నగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఇల్లు అద్దెకు కావాలంటే ఓనర్లు ఎన్ని కండిషన్లు పెడతారో అద్దెకు ఉండేవాళ్లందరికీ తెలిసిన సంగతే.. అద్దె ఇంటి కష్టాలు ఎలా ఉంటాయో ముఖ్యంగా బ్యాచిలర్లను అడిగితే మరింత బాగా తెలుస్తుంది. ముఖ్యంగా బెంగళూరు లాంటి ఐటీ హబ్ గా, స్టార్ట్ అప్ లకు రాజధానిగా పేరుపడ్డ మెట్రో నగరాల్లో అద్దెకు ఇల్లు దొరకడం మామూలు విషయం కాదు.. అది నిజంగా గగనమే.. ఎందుకంటే అక్కడి ఓనర్లు పెట్టే నిబంధనలు చాలా దారుణంగా ఉంటాయి. కొన్నిసార్లు వారు పెట్టే నిబంధనలు లాజిక్ కు అందవు. అలాంటి ఓ విచిత్ర ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులో అద్దె ఇళ్లల్లో ఉండేవారి కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! బాధితులు తమ వెతనలను అప్పుడప్పుడూ నెట్టింట్లో పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఒక వ్యక్తి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అద్దెకు ఇల్లుకావాలని తన స్నేహితుడిని అడిగాడు. అతను ఓ మధ్యవర్తి ద్వారా ఓ ఫ్లాట్ యజమానిని సంప్రదించాడు. ప్లాట్ యజమాని సదరు వ్యక్తి లింక్డ్ ఇన్ ప్రొఫైల్, జాబ్ జాయినింగ్ లెటర్, అతని క్వాలిఫికేషన్, పాన్, ఆధార్ కార్డుల వివరాలు కావాలని కోరాడు. వామ్మో.. ఇల్లు అద్దెకు కావాలంటే ఇన్ని సమర్పించుకోవాలా అనుకుంటూ అతను అడిగినవన్నీ పంపిస్తూ తన గురించిన వివరాలు కూడా మెసేజ్ చేశాడు. రెండు రోజుల తర్వాత మధ్యవర్తిదగ్గరనుంచి తన మిత్రుడికి ఫోన్ వచ్చింది. అవతలి నుంచి విన్న మాటలకు అతనికి మూర్చవచ్చినంత పనైంది. ఇంతకీ రిప్లై ఏంటంటే..
“Marks don’t decide your future, but it definitely decides whether you get a flat in banglore or not” pic.twitter.com/L0a9Sjms6d
— Shubh (@kadaipaneeeer) April 27, 2023
ఇల్లు అద్దెకు కావాలని అడిగిన వ్యక్తికి 12వ తరగతిలో 90 శాతం మార్కులు రాకపోవడంతో ఫ్లాట్ అద్దెకు ఇవ్వనన్నాడని చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే తన మిత్రుడికి కేవలం 75 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. చేసేది లేక అతను విషయం తన మిత్రుడికి చెప్పాడు. మన మార్కులు భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియదు కానీ.. బెంగళూరులో అద్దెకు ఫ్లాట్ దొరికేదీ లేనిదీ కచ్చితంగా నిర్ణయిస్తాయని చివర్లో చమత్కరిస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు. ఇళ్ల బ్రోకర్‌తో జరిపిన వాట్సాప్ సంభాషణ కూడా అతడు నెట్టింట షేర్ చేశాడు. దాంతో ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..