Watch Video: ఏనుగు ముందు ఏశాలేసిన అమ్మాయి.. ఈడ్చి కొడితే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది..

అరటి పండు అంటే మనకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ ఏనుగు ముందు అరటి పండు కనిపిస్తే అంతే సంగతి. గెలలు గెలలకే లాగించేస్తాయి. అందుకే చాలా మంది ప్రజలు ఏనుగులకు అరటి పండ్లను..

Watch Video: ఏనుగు ముందు ఏశాలేసిన అమ్మాయి.. ఈడ్చి కొడితే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది..
Elephant Attack
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2023 | 8:47 PM

అరటి పండు అంటే మనకే కాదు.. కొన్ని జంతువులకు కూడా చాలా ఇష్టం. అందులో మొదటి వరుసలో కోతులు ఉంటాయి. ఆ తరువాత మరీ ఎక్కువగా ఇష్టపడే జంతువు ఏనుగు. ఈ ఏనుగు ముందు అరటి పండు కనిపిస్తే అంతే సంగతి. గెలలు గెలలకే లాగించేస్తాయి. అందుకే చాలా మంది ప్రజలు ఏనుగులకు అరటి పండ్లను ఆహారం అందిస్తుంటారు. వాటిని తిని అవి సంతోషిస్తాయి.

తాజాగా ఓ యువతి భారీ ఏనుగుకు అరటి పండు తినిపించడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో ఏనుగుతో కాస్త ఆడుకోవాలని భావించింది. కానీ, ఏనుగు ముందు ఆమె ఆటలు సాగలేదు. చివరకు ఏనుగు ఇచ్చిన షాక్‌కి బిత్తరపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ యువతి సరదాగా అరటి పండ్లను ఏనుగుకి తినిపించాలని ప్రయత్నించింది. అయితే, ఏనుగు ఆమెను సమీపించగానే అరటి పండ్లతో దోబూచులాడింది. ఇంకేముంది.. ఆ ఏనుగుకి బాగా కలింది. ఆడుకుంటున్నట్లుగానే దగ్గరకు వచ్చి.. ఒక్కసారిగా తొండంతో యువతిని నెట్టేసింది. దెబ్బకు గింగిరాలు తిరుగుతూ కింద పడిపోయింది అమ్మడు. ఏనుగు ఇచ్చిన ట్విస్ట్‌తో ఆమెకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.

కాగా, ఈ సీన్‌ను అంతా ఆమె వెంట వచ్చిన వ్యక్తులు తమ ఫోన్ కెమెరాలో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఆమె చేసిన పనికి చివాట్లు పెడుతున్నారు. ఏనుగుతో పరిచికాలు మంచిది కాదని హితవు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..