AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పర్యాటకుల్ని పరిగెత్తించిన ఖడ్గమృగం.. కిలోమీటరుకు పైగా జీపుతో ఉరికించింది.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

ఖడ్గమృగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, వారి జీపు వెంటపడిందని చెప్పారు. దాంతో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి ఖడ్గమృగానికి చిక్కకుండా మరింత వేగం పెంచాడు. అయినప్పటికీ అది జీపును కిలోమీటరుకు పైగా వెంబడించింది. బురదమయంగా ఉన్న రోడ్లపై డ్రైవర్ వీలైనంత వేగంగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. అంతే వేగంగా ఆ ఖడ్గమృగం కూడా స్పీడ్‌ పెంచింది.

Viral Video: పర్యాటకుల్ని పరిగెత్తించిన ఖడ్గమృగం.. కిలోమీటరుకు పైగా జీపుతో ఉరికించింది.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Angry Rhino
Jyothi Gadda
|

Updated on: Mar 29, 2023 | 5:51 PM

Share

జాతీయ ఉద్యానవనాలు, మరియు జంతుప్రదర్శనశాలలను సందర్శించేటప్పుడు అక్కడి జంతువులపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనుషులు చేసే విపరీతమైన ప్రవర్తన జంతువులకు కోపం తెప్పిస్తుంటారు. దాంతో అవి వారిపై దాడి చేస్తుంటాయి. అందుకే అడవి జంతువుల సఫారీ సమయంలో ఫారెస్ట్ గార్డులు.. పర్యాటకులకు అనేక భద్రతా నియమాలను ముందుగానే తెలియజేస్తారు. మనుషులపై క్రూర జంతువులు దాడి చేస్తున్న వీడియోలు గతంలో చాలానే సోషల్ మీడియాలో వైరల్‌ కావడం చూశాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పర్యాటకులపై ఆగ్రహించిన ఒక ఖడ్గమృగం వారి వాహనాన్ని ఒక కిలోమీటరుకు పైగా వెంబడించింది. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ పేజీ లేటెస్ట్‌క్రూగర్ పోస్ట్ చేసిన వీడియోలో ఒక ఖడ్గమృగం సఫారీ జీప్‌ను వెంబడిస్తుండటం చూడొచ్చు. ఈ వీడియో దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ క్రుగర్ నేషనల్ పార్క్‌లో సఫారీలో ఉండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అనస్తాసియా చాప్‌మన్ తన స్నేహితులతో కలిసి సఫారీకి వెళ్లినప్పుడు కోపంగా ఉన్న ఖడ్గమృగం ఆమె జీప్‌ను వెంబడించింది. ఖడ్గమృగం కిలోమీటరుకు పైగా వారి జీపు వెంట పరుగులు తీసింది. మట్టిరోడ్డుపై వీలైనంత వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడు డ్రైవర్‌. ఎక్కడో దూరంగా ఆహారం తింటున్న ఖడ్గమృగం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, వారి జీపు వెంటపడిందని చెప్పారు. దాంతో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి ఖడ్గమృగానికి చిక్కకుండా మరింత వేగం పెంచాడు. అయినప్పటికీ అది జీపును కిలోమీటరుకు పైగా వెంబడించింది. బురదమయంగా ఉన్న రోడ్లపై డ్రైవర్ వీలైనంత వేగంగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. అంతే వేగంగా ఆ ఖడ్గమృగం కూడా స్పీడ్‌ పెంచింది. కానీ, ఎట్టకేలకు వారు దాని నుంచి తప్పించుకుని బయటపడ్డారు. క్రూగర్ పార్క్ కూడా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ భయానక సంఘటన గురించి చాప్‌మన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. తనకు ఖడ్గమృగంతో వింత అనుభవం ఉందని చెప్పాడు. అది మమ్మల్ని ఒక కిలోమీటరు దూరం పరిగెత్తించిందని చెప్పారు. దీని నుంచి మమ్మల్ని మేము కాపాడుకునేందుకు మట్టిరోడ్డుపై బండిని వీలైనంత వేగంగా నడిపినట్లు మా గైడ్ పేర్కొన్నారు. ఖడ్గమృగం ప్రవర్తన నిజంగా సహజంగా లేదని చెప్పారు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై ప్రజలు ఆశ్చర్యంగా స్పందించారు. అంత భారీ శరీరంతో ఉన్న ఖడ్గమృగం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంటూ నెటిజన్లు ఆశ్చర్య వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..