Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రెయినేజీ గుండా జ్యువెలరీ షాపులోకి సొరంగం.. తెల్లారేసరికి షాపు మొత్తం లూటీ..!

పోలీసులు దుకాణంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు వ్యాపారులు. ఇప్పుడు జరిగిన దోపిడీ సహా, ఇటీవలి వారాల్లో జరిగిన పలు దొంగతనం కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. చోరీ ఘటనలు విచారించడానికి సీనియర్ అధికారి హాజరు కావాలంటూ వ్యాపారులు డిమాండ్ చేశారు.

డ్రెయినేజీ గుండా జ్యువెలరీ షాపులోకి సొరంగం.. తెల్లారేసరికి షాపు మొత్తం లూటీ..!
Thieves Rob Up Jewellery Sh
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2023 | 3:55 PM

సినిమా తరహాలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని ఓ దుకాణంలో డ్రెయినేజీలోంచి 10 అడుగుల సొరంగం తవ్వి లక్షల రూపాయల విలువైన నగలను దొంగలు అపహరించారు. మంగళవారం ఉదయం వ్యాపార నిమిత్తం జ్యువెలరీ షోరూం యజమాని దుకాణాన్ని తెరిచేందుకు రాగా, డ్రెయిన్ గుండా షాపులోకి వెళ్లడానికి సొరంగం ఉన్నట్టుగా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,.. దొంగలు దుకాణంలోకి ప్రవేశించడానికి డ్రైనేజీని నిర్మాణాన్ని కూల్చివేస్తూ సొరంగం తవ్వకున్నారు. ఆ సొరంగం గుండా నేరుగా దుకాణంలోకి ప్రవేశించారు. లక్షలాది రూపాయల నగలు సర్దుకుని దొంగలు పారిపోయారని పోలీసులు నిర్ధారించారు. అయితే, చోరీకి గురైన సొత్తు మొత్తం ఎంత అనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

సంచలనం సృష్టించిన దోపిడీ వార్త రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో మీరట్ బులియన్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని నిరసిస్తూ భారీగా షోరూమ్‌ వద్దకు చేరుకున్నారు. నగరంలో ఇలాంటి దోపిడీ ఘటన ఇది నాలుగోసారి అంటూ వ్యాపారులు ఆరోపించారు.

దోపిడీ జరిగిందనే సమాచారం మేరకు ఇద్దరు పోలీసు అధికారులు షోరూమ్‌కు చేరుకున్నారు. కాగా, వ్యాపారులు పోలీసులు దుకాణంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు జరిగిన దోపిడీ సహా, ఇటీవలి వారాల్లో జరిగిన పలు దొంగతనం కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. చోరీ ఘటనలు విచారించడానికి సీనియర్ అధికారి హాజరు కావాలంటూ వ్యాపారులు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, సుమారు రూ.10 నుంచి రూ.15 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు షాపు యజమాని పీయూష్ గార్గ్ తెలిపారు. చోరీలను చేధించి, దొంగలను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..–