కుప్పకూలిన బంగారు గని.. తన ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులను రక్షించిన సూపర్ హీరో..! వీడియో వైరల్

బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి, చాలా మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి తన చేతులతో మట్టిని తొలగించి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా లోపల ఉన్న 9 మంది ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుప్పకూలిన బంగారు గని.. తన ప్రాణాలను పణంగా పెట్టి  కార్మికులను రక్షించిన సూపర్ హీరో..! వీడియో వైరల్
Collapsed Gold Mine
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2023 | 3:14 PM

గోల్డ్ మైన్ కుప్పకూలింది. బంగారు గని కూలిపోవడంతో పదుల సంఖ్యలో కార్మికులు గనిలో చిక్కుకున్నారు. సెంట్రల్ ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో)లో ఈ ఘటన జరిగింది. దక్షిణాఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బంగారు గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులను ఓ వ్యక్తి తన ప్రాణాలను ఫణంగాపెట్టి రక్షించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొమ్మిది మంది కాంగో కార్మికులు బురద నుండి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఈ ఘటన సామాజిక ప్రపంచాన్ని కుదిపేసింది. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలోని కివు ప్రావిన్స్ వంటి చిన్న ప్రాంతంలో బంగారు మైనింగ్ ఏరియాల్లో తరచుగా విపత్తులు సంభవిస్తుండటం, కొండచరియలు విరిగిపడుతుంటాయి. గత శనివారం అక్కడ కురిసిన భారీ వర్షానికి గనిలో ఎక్కువ భాగం కుప్పకూలింది. గని కూలిపోవడంతో కూలీల జీవనం అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో కనిపించింది.

దక్షిణాఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బంగారు గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులను ఓ వ్యక్తి రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి, చాలా మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి తన చేతులతో మట్టిని తొలగించి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా లోపల ఉన్న 9 మంది ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఇవి కూడా చదవండి

నికోలస్ నియార్కోస్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ముంబోకో సమీపంలోని లువోవో వద్ద గనిలో చిక్కుకున్న మైనర్‌ను నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మరో కార్మికుడు కాపాడాడు. మార్చి 24న జరిగిన ఘటన ఇది. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు.

వీడియోలో చూసినట్లుగా, ఈ ఏటవాలుగా ఉన్న గనిలో పైనుండి మట్టి కూలిపోతుంటే, కూలిపోతున్న మట్టిని లెక్కచేయకుండా గనిలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ఒక వ్యక్తి బాధితులకు సాయం చేస్తున్నాడు. 2 నిమిషాల వీడియోలో అక్కడ పనిచేస్తున్న మైనర్లు గని కూలిపోవడంతో దూరంగా పరిగెడుతున్న దృశ్యం కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో తన సహోద్యోగులను రక్షించడానికి మైనర్ తన ప్రాణాలను పణంగా పెట్టినందుకు ప్రజలు ప్రశంసించారు. చాలా మంది అతన్ని కాంగో సూపర్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేకపోవడం వల్ల కాంగో గనులలో తరచుగా సొరంగం కూలిపోవడానికి దారి తీస్తుంది. చాలా సందర్భాలలో, మైనర్లు భూగర్భంలో చిక్కుకున్నారని, మనుగడకు తక్కువ అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్ నివేదించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట