AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: జపాన్ లో మరోసారి భారీ భూకంపం..సునామీ హెచ్చరికలపై అధికారుల ప్రకటన..?

భూకంపం జపాన్‌ను తాకింది: జపాన్ లో వరుస భూకంపాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఉత్తర జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం మరో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Earthquake: జపాన్ లో మరోసారి భారీ భూకంపం..సునామీ హెచ్చరికలపై అధికారుల ప్రకటన..?
Earthquake
Jyothi Gadda
|

Updated on: Mar 28, 2023 | 9:40 PM

Share

భూకంపం జపాన్‌ను తాకింది: జపాన్ లో వరుస భూకంపాలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఉత్తర జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం మరో భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని సమాచారం. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, భూకంపం సాయంత్రం 6:18 గంటలకు (0918 GMT) 20 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో సంభవించింది.

కాగా, జపాన్ భూభాగం అత్యంత భారీ భూకంపాలు వచ్చే ప్రదేశంలో ఉంది. అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతం ఆగ్నేయ యాసియా నుంచి పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతం..ఆ ప్రాంతంలో సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు, టెక్టానిక్ ప్లేట్ కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఉన్నందువల్లే జపాన్ అత్యంత కఠినమైన నిర్మాణాలు కలిగి ఉంది.

2011లో జపాన్ సమీపంలోని సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దాని దాటికి సునామీ అలలు ఎగిసిపడి సెండాయ్ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసేసాయి. 40.5 మీటర్ల ఎత్తులో ఎగిసి పడిన రాకాసి అలల కారణంగా 20 వేలకు పైగా ప్రజలు మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..