AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 550 మందికి తండ్రయ్యాడు.. ఎలాగో తెలిస్తే షాకే!

ఓ వైద్యుడు చేసిన నిర్వాకం.. అతడ్నే చిక్కుల్లోకి నెట్టేసింది. కట్ చేస్తే.. పంచాయితీ కాస్తా కోర్టుకెళ్లింది. అతడి పేరు బ్లాక్ లిస్టులో చేరింది.

Viral: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 550 మందికి తండ్రయ్యాడు.. ఎలాగో తెలిస్తే షాకే!
Viral
Ravi Kiran
|

Updated on: Mar 29, 2023 | 1:33 PM

Share

ఓ వైద్యుడు చేసిన నిర్వాకం.. అతడ్నే చిక్కుల్లోకి నెట్టేసింది. కట్ చేస్తే.. పంచాయితీ కాస్తా కోర్టుకెళ్లింది. అతడి పేరు బ్లాక్ లిస్టులో చేరింది. వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వైద్యుడు వీర్యదానం ద్వారా ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడు. ఇక ఇదే అతడికి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఇకపై అతడు వీర్యదానం చేయకుండా అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. సదరు మహిళ కూడా అతడి వీర్యం ద్వారానే బిడ్డకు జన్మనిచ్చింది.

ది హేగ్ నగరంలో నివాసముంటున్న 41 ఏళ్ల జొనధన్ ఎం అనే వైద్యుడు.. నెదర్లాండ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 క్లినిక్‌ల వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు.

కానీ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. గరిష్ఠంగా 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. పలు కీలక అంశాల ఆధారంగా ఈ రూల్స్‌ను రూపొందించారు. అయితే వీర్యదానం ద్వారా జొనధన్ 2017లో వందకు పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని తెలిసింది. దీంతో అప్రమత్తమైన నెదర్లాండ్స్ అధికారులు.. ది డచ్‌ సొసైటీ ఆఫ్‌ అబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ విభాగంలో అతడి పేరును బ్లాక్ లిస్టు చేశారు.(Source)

Follow Us
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం