Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Spy Ship:120 రోజులు.. 15వేల నాటికల్‌ మైల్స్‌.. ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్న డ్రాగన్‌ నిఘా నౌక

యువాన్‌వాంగ్‌-5 నౌక దక్షిణ చైనా, హిందూ మహాసముద్రాల్లో 120 రోజుల పాటు 15 వేల నాటికల్‌ మైల్స్ ప్రయాణం చేసిందని చైనా అధికారులు తెలిపారు. ఈ మిషన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో మరోసారి సముద్రంలోకి పంపిస్తామని తెలిపారు

China Spy Ship:120 రోజులు.. 15వేల నాటికల్‌ మైల్స్‌.. ఎట్టకేలకు సొంతగూటికి చేరుకున్న డ్రాగన్‌ నిఘా నౌక
China Spy Ship
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2022 | 7:54 AM

చైనా స్పేస్‌ ట్రాకింగ్‌ షిప్‌ యువాన్‌వాంగ్‌-5 తన సుదీర్ఘ మిషన్‌ను పూర్తి చేసుకొని స్వదేశానికి చేరుకుంది. జాయాంగ్సు ప్రావిన్స్‌లోని తన హోమ్‌ పోర్టుకు తిరిగి వచ్చింది. చైనాకు చెందిన జాంగ్సింగ్‌ 1E శాటిలైట్‌ను హైనాన్‌ ద్వీపం నుంచి లాంగ్‌మార్చ్‌-7 శాటిలైట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపేందుకు ఈ షిప్‌ సహాయం తీసుకున్నారు.హైస్పీడ్‌ డాటా, టెలివిజన్‌, టీవీ ప్రసారాలను ఈ శాటిలైట్‌ ద్వారా అందిస్తారు.. యువాన్‌వాంగ్‌-5 నౌక దక్షిణ చైనా, హిందూ మహాసముద్రాల్లో 120 రోజుల పాటు 15 వేల నాటికల్‌ మైల్స్ ప్రయాణం చేసిందని చైనా అధికారులు తెలిపారు. ఈ మిషన్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో మరోసారి సముద్రంలోకి పంపిస్తామని తెలిపారు. యువాన్‌వాంగ్‌-5 నౌక ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టుకు వచ్చింది. ఐదు రోజుల పాటు ఈ నౌక అక్కడే స్టే చేసింది. యువాన్‌వాంగ్‌-5 నౌకలో అత్యంత ఆధునిక రాడార్లు ఉన్నాయి. గతంలో ఈ నౌక ద్వారా ఖండాంతర క్షిపణులను కూడా ప్రయోగించారు.

కాగా గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ నిఘా నౌక క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల గుర్తించడమే కాదు.. 750 కి.మీపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. కాగా భారత్‌ తీరానికి సమీపం నుంచి ఈ నౌక ప్రయాణించింది. మన తీర ప్రాంతంలోని కీలక స్థావరాలపై నిఘా పెట్టే అవకాశం ఉన్నందున భారత్‌ చైనాపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినప్పటికీ శ్రీలంక యువాన్‌వాంగ్‌-5 నౌక రాకకు అనుమతి ఇచ్చింది. హిందూ మహాసముద్రంపై పట్టు పెంచుకునే క్రమంలో శ్రీలంకను డ్రాగన్‌ దేశం పావుగా వాడుకుంటోంది. ఈ నౌకపై భారత్‌తో అమెరికా తదితర దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..