పంజ్‌షీర్ తమకు చిక్కిందంటున్న తాలిబన్లు.. అడుగుపెడితే శరీరాలు ఛిద్రమే అంటున్న నార్తర్న్‌ అలయెన్స్‌

Panjshir valley: తమకు ఇప్పటివరకు దక్కని పంజ్‌షీర్ వ్యాలీ కోసం తాలిబన్లు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. పంజ్‌షీర్ వ్యాలీకి ఇంటర్నెట్‌, టెలికాం సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే...

పంజ్‌షీర్ తమకు చిక్కిందంటున్న తాలిబన్లు.. అడుగుపెడితే శరీరాలు ఛిద్రమే అంటున్న నార్తర్న్‌ అలయెన్స్‌
Panjshir Valley
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 29, 2021 | 4:50 PM

తమకు ఇప్పటివరకు దక్కని పంజ్‌షీర్ వ్యాలీ కోసం తాలిబన్లు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. పంజ్‌షీర్ వ్యాలీకి ఇంటర్నెట్‌, టెలికాం సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే తమ బలగాలు పంజ్‌షీర్ లోయలోకి ప్రవేశించినట్టు తాలిబన్లు అధికారికంగా ప్రకటించుకున్నారు. అయితే దీనిపై క్లారిటీ లేదు. తమ భూభాగంలోకి తాలిబన్లు అడుగుపెడితే అంతు చూస్తామని నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది. పంజ్‌షీర్ వ్యాలీపై ముప్పేట దాడి చేయడానికి తాలిబన్లు మాస్టర్‌ప్లాన్‌ వేస్తున్నారు. పంజ్‌షీర్ సేనలకు ఆఫ్ఘన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలెహ్‌, అహ్మద్‌ మసూద్‌ నేతృత్వం వహిస్తున్నారు. అమ్రుల్లా సలేహ్‌ సందేశాలు ప్రజలకు వెళ్లకుండా తాలిబన్లు ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్టు తెలుస్తోంది . అయితే పంజ్‌షీర్‌లోని కొన్ని గ్రూపులు తాలిబన్లకు మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలను తజకిస్తాన్‌ నుంచి భారీగా సాయం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాలిబన్ల పాలనను అంగీకరించేది లేదని నార్తర్న్‌ అలయెన్ప్‌ ప్రకటించింది. తుదివరకు తాలిబన్లతో పోరాడుతామని అంటున్నారు అహ్మద్ మసూద్‌. తాలిబన్లు పంజ్‌షీర్ లోకి ప్రవేశించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

పంజ్‌షీర్‌లో తమ పాలనను అంగీకరించాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. తమతో నార్తర్న్‌ అలయెన్స్‌ చర్చలకు రావాలని కోరుతున్నారు. లేదంటే బలప్రయోగం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. మరో 24 గంటల్లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు. అమెరికా పౌరులు ఎయిర్‌పోర్ట్‌ దగ్గరకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.

Also Read:  షాకింగ్.. మహిళను పొడిచిన బర్రె.. కొమ్ములపైన శవంతో రాత్రంతా తిరుగుతూ..

మంత్రుల పర్యటనలో దొంగల చేతివాటం.. పోలీసులు పక్కన ఉన్నా కూడా ఎంత తెలివిగా కొట్టేశారో చూడండి