Video Viral: వంద అడుగుల ఎత్తులో డేగ దాడి.. భయంతో వణికిపోయిన క్లీనర్
కుటుంబాన్ని పోషించుకునేందుకు పని చేయడం అనేది జీవితంలో ముఖ్యమైన భాగం. వివిధ రకాల పనులు చేసుకోవడం అనేది నిత్య జీవన కృత్యం. అయితే కొంత మంది అత్యంత ఎత్తైన పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తుంది. పెద్ద....

కుటుంబాన్ని పోషించుకునేందుకు పని చేయడం అనేది జీవితంలో ముఖ్యమైన భాగం. వివిధ రకాల పనులు చేసుకోవడం అనేది నిత్య జీవన కృత్యం. అయితే కొంత మంది అత్యంత ఎత్తైన పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ లు కట్టడం, ఎత్తైన భవనాలకు రంగులు వేయడం, కిటికీ అద్దాలు శుభ్రపరచడం వంటివి చెప్పుకోవచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు ఊహించని ప్రమాదం జరిగితే.. ఇక అంతే సంగతులు. ఎటూ కదల్లేక, ఎక్కడికీ వెళ్లలేక నానా కష్టాలు పడుతుంటాం. ఈ వీడియో కూడా ఇలాంటిదే. ఎత్తైన భవనంపైకి ఓ వ్యక్తి ఎక్కి కిటికీలు శుభ్రం చేస్తున్నాడు. అదే సమయంలో ఓ డేగ పక్షి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇలా పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వంద అడుగులో ఎత్తులో ఉన్న తనను ఆ పక్షి ఏమైనా చేస్తుందేమోనని తీవ్ర భయానికి గురయ్యాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
View this post on Instagram
Also Read
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత చేష్టలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
Taj Mahal: తాజ్‌మహల్ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!
Health Care: నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉందా? దీని వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తెలుసుకోండి..