AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత చేష్టలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌!

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచిత్రంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీన్స్‌బోరోలోని నార్త కరోలినా..

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింత చేష్టలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌!
Joe Biden
Subhash Goud
|

Updated on: Apr 16, 2022 | 8:42 AM

Share

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచిత్రంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీన్స్‌బోరోలోని నార్త కరోలినా అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నికల్‌ స్టేట్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పోడియం వద్ద జోబైడెన్‌ ప్రసంగించారు. అయితే ప్రసంగం అనంతరం పక్కకు తిరిగి ఎవరికో కరచలనం ఇస్తున్నట్లు చేయి చాచారు. కానీ అక్కడ ఎవ్వరు లేకపోవడం గమనార్హం. తన ప్రసంగాన్ని ముగించిన జో బైడెన్‌ అపై షేక్‌ హ్యాండ్‌ (Shook Hands) పొజిషన్‌లో తన చేతిని చాచి కుడివైపునకు తిరిగారు. అయితే వేదికపై ఆయన సంజ్ఞకు స్పందించేందుకు ఎవరూ లేరు. దీంతో కొన్ని క్షణాల పాటు ఇబ్బందిగా కదిలిన బైడెన్‌.. వెంటనే అక్కడున్న జనాల వైపు మళ్లారు. సెమీకండక్టర్ల ఉత్పత్తికి నిధులను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడారు.

అయితే సుమారు 40 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేసిన బైడెన్‌.. తాను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశానని బైడెన్‌ చెప్పుకొచ్చారు. నిజానికి అక్కడి విద్యార్థులకు ఆయన ఒక్కసారి కూడా బోధించలేదట. దీంతో నెటిజన్లు ఈ అంశంలో ఆయనపై తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ప్రత్యర్థి రిపబ్లిక్‌ పార్టీ నేతలు, బైడెన్‌ ప్రవర్తనా తీరుపై వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. వైట్‌ హౌస్‌, బైడెన్‌ కుటుంబ సభ్యులు ఎక్కడ? ఆయనను అందంగా కనింపించేలా చేయడమే వారి పనా..? అని కాలిఫోర్నియా రిపబ్లిక్‌ పార్టీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ హర్మీత్ కె ఢిల్లన్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఆయన డిమెన్షియా బాధితుడిలా కనిపించాలని వారు కోరుకుంటే తప్ప.. ఇది నిజంగా వింతగా ఉంది’ అని అన్నారు. జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉండేందుకు అనర్హుడంటూ విమర్శలు చేస్తున్నారు. బైడెన్‌ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. హౌస్‌ జ్యుడిషియరీ కమిటీ ర్యాంకింగ్‌ సభ్యుడు జిమ్‌ జోర్దాన్‌ కూడా జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడం మానుకోండి.. అమెరికాకు రష్యా వార్నింగ్

Kim Jong-un: కిమ్ మామూలోడు కాదు.. హ్యాకర్స్‌తో క్రిప్టో కరెన్సీ దోపిడీ.. FBI సంచలన ప్రకటన..