Srilanka Crisis: భారత కంపెనీలకు లంకంత కష్టం.. తలకిందులైన పరిస్థితులు.. ఎందుకంటే..

Srilanka Crisis: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) వల్ల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. నిత్యవసరాలు, గ్యాస్, ఇంధన ధరలు, అత్యవసర ఔషధాలు ఇలా అన్నింటి కొరత ఒక్కసారిగా ద్వీపదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Srilanka Crisis: భారత కంపెనీలకు లంకంత కష్టం.. తలకిందులైన పరిస్థితులు.. ఎందుకంటే..
Srilanka
Ayyappa Mamidi

|

Apr 16, 2022 | 9:59 AM

Srilanka Crisis: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) వల్ల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. నిత్యవసరాలు, గ్యాస్, ఇంధన ధరలు, అత్యవసర ఔషధాలు ఇలా అన్నింటి కొరత ఒక్కసారిగా ద్వీపదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం(Economic Crisis) కారణంగా రాజకాయ నేతలు సైతం రాజీనామాలు చేయటం, సాయం కోసం ఎదురు చూపులు అక్కడ కీలకంగా మారింది. లంకకు వీలైనంత సాయం చేసేందుకు భారత్ సైతం ప్రయత్నిస్తున్నప్పటికీ అవి దేశాన్ని గాడిలో పెట్టడానికి సరిపోవటం లేదు. పతనమైన శ్రీలంక రూపాయి విలువ తాజాగా భారత కంపెనీలకు మరో ఎదురుదెబ్బని చెప్పుకోవాలి.

శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం.. దాని పర్యవసానంగా స్థానిక కరెన్సీ విలువ పతనం – ద్వీప దేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల ఆదాయాలు, లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సఫైర్ ఫుడ్స్ – భారత్, శ్రీలంకలో KFC, పిజ్జా హట్‌ను నిర్వహిస్తోంది – అలాగే రెండు దేశాలలో డొమినోస్ పిజ్జా ఫ్రాంఛైజీని నడుపుతున్న జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ శ్రీలంక రూపాయి విలువ తగ్గడంతో ప్రభావితమవుతోందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

దేశీయ దిగ్గజ కంపెనీలైన.. డాబర్, ఏషియన్ పెయింట్స్, తాజ్ హోటల్స్, ఇండియన్ ఆయిల్, ఎయిర్‌టెల్, అశోక్ లేలాండ్, ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్ ఈ సంక్షోభం వల్ల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. రూపాయి తగ్గటం వల్ల భారత వస్త్ర సంస్థలు శ్రీలంకతో వ్యాపారం చేయడం ప్రమాదకరంగా మారిందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. వస్త్రాల తయారీ యూనిట్లకు ముడిసరుకు సరఫరా చేసే కంపెనీలు చెల్లింపుల్లో జాప్యం జరగవచ్చని ఆందోళన చెందుతున్నాయి. శ్రీలంక కరెన్సీ విలువ తగ్గింపు కారణంగా భారతీయ కంపెనీల ఫైనాన్సియల్ పనితీరును, లాభాలను తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న భారత కంపెనీలు కరెన్సీ విలువ మారటం వల్ల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని అంటున్నారు. GDP మందగమనం, పర్యాటకం, సంబంధిత రంగాలను కూడా బెదిరిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. శ్రీలంకకు భారత్ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్. ఇండియా 2020-21లో 5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను అక్కడికి ఎగుమతి చేసింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Investment: బ్యాంక్ డిపాజిట్స్ vs మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఏది బెస్ట్? తెలుసుకోండి..

Zomato: వారికి షాకిచ్చిన జొమాటో.. ఆ నిబంధనలు ఏకపక్షమంటూ ఆందోళనలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu