Petrol Diesel Price Today: దేశంలో ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

Petrol Diesel Price Today: దేశంలో ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 16, 2022 | 9:41 AM

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఒక వైపు నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా ఏప్రిల్‌ 16 పెట్రోల్‌ ధరలను చమురు కంపెనీలు విడుదల చేశాయి. ఈ రోజు పెట్రోల్ (Petrol), డీజిల్ ధర (Diesel Rates)ల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో వరుసగా 11వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. అయితే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశంలోని సామాన్యులకు ఇది ఊరటనిచ్చే వార్త. ఎందుకంటే మార్చి 22 నుంచి చమురు ధరలు పెరగడం ప్రారంభించిన తీరు చూస్తుంటే నెల రోజుల్లోనే పెట్రోలు-డీజిల్ 20 నుంచి 25 శాతం వరకు పెంచాయి చమురు కంపెనీలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 రోజులుగా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. బెండ్రెక్స్‌

16 రోజుల్లో చమురు ధర రూ.10 పెంపు:

మార్చి 22 నుండి, చమురు ధరలు పెరగడం ప్రారంభించాయని, చివరిసారిగా ఏప్రిల్ 6 న చమురు ధరలు పెరిగాయి. ఇక రాజధాని ఢిల్లీలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.10 పెరిగింది. మార్చి 21న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 ఉండగా, ఏప్రిల్ 6న రూ.105.41కి పెరిగింది. అయితే ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీతో పాటు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, కోల్‌కతాలో రూ.115.12, చెన్నైలో రూ .110.85గా ఉంది .

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన లేదు లేదు:

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న దేశం.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి పన్నును తగ్గించే మూడ్‌లో లేదని కొన్ని మీడియా కథనాలలో స్పష్టమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్ ధర 111 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడవుతోంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి:

☛ ఢిల్లీ: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.41, డీజిల్‌ ధర రూ.96.67

☛ హైదరాబాద్‌: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49, డీజిల్‌ ధర రూ.119

☛ ముంబై: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.120.51, డీజిల్‌ రూ.104.77

☛ చెన్నై: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.85, డీజిల్‌ ధర రూ.105.49.

☛ కోల్‌కతా: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.115.12, డీజిల్‌ ధర రూ.99.83

ఇవి కూడా చదవండి:

Aadhaar History: మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

LIC Premium: UPI ద్వారా LIC ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారా..? ఈ దశలను అనుసరించండి!

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి