Aadhaar History: మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

Aadhaar History: ప్రస్తుతం అన్నింటికి ఆధారే ముఖ్యం. అన్ని డాక్యుమెంట్లలో ముఖ్యమైనది ఆధార్‌ కార్డు. ఇది లేనిది పనులు జరగవు. బ్యాంకింగ్‌ (Banking)..

Aadhaar History: మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
Follow us

|

Updated on: Apr 15, 2022 | 11:49 AM

Aadhaar History: ప్రస్తుతం అన్నింటికి ఆధారే ముఖ్యం. అన్ని డాక్యుమెంట్లలో ముఖ్యమైనది ఆధార్‌ కార్డు. ఇది లేనిది పనులు జరగవు. బ్యాంకింగ్‌ (Banking) పనుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల వరకు ఆధార్ కార్డు (Aadhaar Card) లేనిది పనులు జరిగే పరిస్థితి లేదు. చిన్న చిన్న వాటికి కూడా ఆధార్‌ తప్పనిసరైంది. అందులో ఆధార్‌ కార్డులో తప్పులుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఇది ముఖ్యమైన గుర్తింపు రుజువులలో ఒకటిగా చెప్పావచ్చు. దాదాపు ప్రతిచోటా ఆధార్ నంబర్ (Aadhaar Number) అడుగుతున్నారు. పౌరుల బయోమెట్రిక్, జనాభా వివరాలు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) జారీ చేసిన ఆధార్ కార్డులో నమోదు చేయబడ్డాయి. భారతదేశంలోని ప్రతి పౌరుడు తన గుర్తింపును నిరూపించుకోవడానికి, ప్రభుత్వ ఏజెన్సీలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. అయితే ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నందున చాలా మంది ఆధార్ కార్డ్ దుర్వినియోగం గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. మన ఆధార్‌ కార్డును ఇతర వ్యక్తులు నకిలీ ఆధార్‌ కార్డును సృష్టించి వాడుకుంటున్నారు. ఇలాంటి మోసాలు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎన్నో బయట పెట్టారు. UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా గత 6 నెలల్లో ధృవీకరణ కోసం మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించబడిందో మీరు తెలుసుకునే ఆస్కారం ఉంది. ఒకవేల మీ ఆధార్ కార్డు ఎవరైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే సంగతులు. అందుకే మన ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారా?, వారు మన కార్డును ఎక్కడైనా ఉపయోగించారా..? అనే విషయాన్ని తెలుసుకునేందుకు యూఐడీఏఐ (UIDAI) అవకాశం కల్పిస్తోంది. కొన్ని దశలను అనుసరించడం వల్ల మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించబడిందో సులభంగా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా ఆధార్ అధికారిక యూఐడీఏఐ (https://uidai.gov.in) పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లాలి.
  2. తర్వాత మై ఆధార్‌ సెక్షన్‌లోకి వెళ్లి ఆధార్‌ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి.
  3. ఇక ఆధార్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 8వ వరుసలో కనిపించే ఆధార్‌ అథెంటికేషన్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.
  4. ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయాలి.
  5. ఎప్పటి నుంచి హిస్టరీ కావాలో ఎంచుకుని తేదీ, నెల, సంత్సరం ఎంటర్‌ చేయాలి.
  6. ఇక్కడ ఆరు నెలలకు సంబంధించిన సమాచారం మాత్రమే వస్తుంది.
  7. ఆ తర్వాత మీ ఆధార్‌కు లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత దానిని ఎంటర్‌ చేయాలి.
  8. ఇప్పుడు మీరు ఏ సమయంలో, ఎక్కడ ఉపయోగించారో పూర్తి వివరాలు తెలిసిపోతాయి.
  9. ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే కచ్చితంగా మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు లింకు అయి ఉండాలి.
  10. దీని తర్వాత, మీ ఆధార్ కార్డ్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడింది అనే సమాచారం మీ ముందుకు వస్తుంది.
  11. Aadhaar Card

ఇవి కూడా చదవండి:

LIC Premium: UPI ద్వారా LIC ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారా..? ఈ దశలను అనుసరించండి!

PAN Card Reprint: మీ పాన్‌ కార్డు పోయిందా..? టెన్షన్‌ అక్కర్లేదు.. ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డు వచ్చేస్తుంది!