Kim Jong-un: కిమ్ మామూలోడు కాదు.. హ్యాకర్స్‌తో క్రిప్టో కరెన్సీ దోపిడీ.. FBI సంచలన ప్రకటన..
North Korean hackers: దీపావళి తారాజువ్వలకు.. ఉత్తర కొరియా క్షిపణులకు తేడా లేకుండా పోయింది.. ఎప్పుడంటే అప్పుడు క్షిపణులను పరీక్షిస్తూ పెద్దన్నను వణికిస్తున్నాడు కిమ్ జోంగ్ (Kim Jong-un)..
North Korean hackers: దీపావళి తారాజువ్వలకు.. ఉత్తర కొరియా క్షిపణులకు తేడా లేకుండా పోయింది.. ఎప్పుడంటే అప్పుడు క్షిపణులను పరీక్షిస్తూ పెద్దన్నను వణికిస్తున్నాడు కిమ్ జోంగ్ (Kim Jong-un).. అమెరికా ఆంక్షలను కూడా బేఖాతరు చేస్తూ అణ్వాయుధాలను సమకూర్చుకుంటూ ఖబర్దార్ అంటూ బెదిరిస్తున్నారు.. పేదరికంతో ఉన్న ఈ చిన్న దేశానికి ఈ ఆయుధాలు తయారు చేసుకునేందుకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది?.. అమెరికా నిఘా సంస్థ చేసిన దర్యాప్తులో అదిరిపోయే విషయాలు బయట పడ్డాయి.. NFT గేమ్‌తో 600 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) దోపిడీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థ (FBI) తెలిపింది. నార్త్ కొరియా అణ్వస్త్రాలు, క్షిపణులు తయారు చేయడం, పలు దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేయడం క్రిప్టో కరెన్సీ దోపిడీ పుణ్యమేనని ఎఫ్‌బీఐ గుర్తించింది.
తమ దేశంపై ఆంక్షలు ఉన్నా పట్టించుకోకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా అణ్వస్త్రాలు, క్షిపణులు సమకూర్చుకుంటోంది ఉత్తర కొరియా.. ఈ క్రిప్టోలు కూడా కొల్లగొట్టినవేనని తేలింది.. ఉత్తర కొరియా హ్యాకర్లు యాక్సిస్ ఇన్ఫినిటీ అనే ఓ వీడియోగేమ్ నెట్‌వర్క్ ద్వారా క్రిప్టోల ఎక్స్‌ఛేంజిల్లో చొరబడి కాజేస్తున్నారు.. లాజరస్ అనే గ్రూపు ఉత్తర కొరియాకు క్రిప్టోలను అందిస్తోంది.. లాజరస్ మీద అమెరికా తాజాగా ఆంక్షలను విధించింది.. కిమ్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల చోరీకి ‘యాపిల్ జ్యూస్’ పేరిట ఓ మాల్వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు బయట పడింది.. ఈ మాల్వేర్ ద్వారా 30 దేశాల్లో సైబర్ దాడులు జరిపి 316 మిలియన్ డాలర్ల (రూ.4,500 కోట్ల) వరకు కాజేశారని తేలింది.
ఉత్తర కొరియా హ్యాకర్లను గుర్తించి అడ్డుకోవడం అమెరికాకు కూడా కష్టమే.. ఎందుకంటే అక్కడి నెట్‌వర్క్స్ ఇతర దేశాలతో కనెక్ట్ కాకపోవడంతో ప్రపంచంతో సంబధాలు లేవు.. మొత్తానికి టెక్నాలజీని తెలివిగా వాడుకొని అమెరికాను బెదిరిస్తోంది ఉత్తర కొరియా. కాగా.. ఎఫ్‌బీఐ నివేదికతో క్రిప్టో సంస్థలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి.
Also Read: