UK Indian Doctor: వైద్య వృతికే కళంకం తెచ్చిన ఇండియన్ డాక్టర్.. 35 ఏళ్లలో 54 మంది మహిళా పేషెంట్లతో..

UK Indian Doctor: పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన డాక్టర్‌ 48 మంది మహిళా పేషంట్లపై లైంగిక దాడులకు

UK Indian Doctor: వైద్య వృతికే కళంకం తెచ్చిన ఇండియన్ డాక్టర్.. 35 ఏళ్లలో 54 మంది మహిళా పేషెంట్లతో..
Doctor
Follow us

|

Updated on: Apr 16, 2022 | 5:50 AM

UK Indian Doctor: పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తీసుకువచ్చాడు ఓ ప్రబుద్ధుడు. బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన డాక్టర్‌ 48 మంది మహిళా పేషంట్లపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు తేల్చింది అక్కడి న్యాయస్థానం. ఈ కేసులోనే డాక్టర్‌ కృష్ణసింగ్‌కు వచ్చే నెల శిక్ష ఖరారు కానుంది. మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఈ వ్యవహారం 2018లో ఓ మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

వైద్యున్ని దేవునితో సమానంగా భావిస్తారు మన భారతీయులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వృతికి ఎంతో పవిత్రత ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఓ డాక్టర్‌ పేషంట్ల నమ్మకాన్ని వమ్ము చేయడం ద్వారా ఈ వృత్తికి కళంకం తెచ్చాడు. తన దగ్గరకు వచ్చే మహిళా పేషంట్లకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంటూ వచ్చాడు. ఏళ్ల తరబడి కొనసాగిన ఈ లైంగిక దోపిడికి మూల్యం చెల్లించాల్సిన సమయం వచ్చేసింది.

స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో నగరంలో చాలా ఏళ్లుగా డాక్టర్‌గా సేవలు అందిస్తున్నాడు కృష్ణ సింగ్‌(72). అక్కడి సమాజంలో మంచి పేరు సంపాదించాడు. డాక్టర్‌ కృష్ణసింగ్‌ వైద్య సేవలకు గుర్తింపుగా దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘రాయల్ మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’ను ఇచ్చి గౌరవించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు ఆయన సమాజం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, డాక్టర్‌ కృష్ణసింగ్‌ తనను లైంగికంగా వేధించారంటూ 2018లో తొలిసారిగా ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చేపట్టిన విచారణలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటకు వచ్చాయి. కృష్ణసింగ్‌ గత 35 ఏళ్లలో 54 మంది మహిళలతో అనుచింతంగా వ్యవహరించినట్లు తేలింది. 1983 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు ఈ తతంగం కొనసాగింది. బాధితులంతా ఆయన దగ్గరకు వచ్చిన పేషంట్లే.

డాక్టర్‌ కృష్ణసింగ్ మహిళా రోగుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించేవాడు. ముద్దులతో పాటు ఎక్కడ పడితే అక్కడ చేయి వేయడం, అసభ్య వ్యాఖ్యలు, అవసరం లేని పరీక్షలు ఇందులో భాగం. నార్త్​లనార్క్​షైర్ ప్రాంతంలో ప్రాక్టీసు చేస్తున్న సమయంలో ఈ వ్యవహారమంతా కొనసాగింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు, పేషంట్ల ఇళ్లకు వెళ్లి మరీ ఈ దారుణాలకు తెగబడినట్లు కృష్ణసింగ్‌ మీద ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఓ పోలీసుస్టేషన్‌లో పేషంట్‌ను చూసే సమయంలో కూడా ఇదే పని చేసి చేసినట్లు తేలింది.

కృష్ణ సింగ్‌ మీద వచ్చిన ఈ ఫిర్యాలన్నింటినీ గ్లాస్గో హైకోర్టు విచారించింది. విచారణ సమయంలో పేషంట్లు తనపై చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చాడు. పైగా ఈ చికిత్సా విధానం తాను ఇండియాలో వైద్య శిక్షణ తీసుకున్న సమయంలో నేర్చుకున్నట్లు బుకాయించాడు. కృష్ణ సింగ్‌ మీద దాఖలైన 54 కేసుల్లో 48 రుజువయ్యాయి. వచ్చే నెలలో ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. మిగతా కేసులపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం డాక్టర్‌ కృష్ణసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చారు.

Also read:

Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి

Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..

Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొందిం..