Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..

Hair Care Tips: ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్

Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..
Hair Care
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 15, 2022 | 10:07 AM

Hair Care Tips: ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు, తలకు చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయల్లో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తలలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడుతాయి. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలగా పనిచేస్తుంది ( జుట్టు సంరక్షణ చిట్కాలు ). జుట్టు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసం ఉల్లిపాయను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ నూనెను ఉపయోగించి కూడా హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఉల్లిపాయ నూనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది.. ఉల్లిపాయ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఇది జుట్టు రంగు మారడాన్ని తగ్గిస్తుంది.

పొడి జుట్టుకు చికిత్స చేస్తుంది.. పొడిబారిన జుట్టుకు ఉల్లిపాయ నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు మెరుపు పెరుగుతుంది. కానీ మీ స్కాల్ప్ జిడ్డుగా ఉంటే, దాని వాడకాన్ని తగ్గించండి.

జుట్టును మెరిసేలా చేస్తుంది.. ఉల్లిపాయ నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టుకు మెరుపును ఇస్తుంది. ఉల్లిపాయ నూనె జుట్టు మీద కండిషనింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. షాంపూ చేయడానికి ముందు దీనిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.

చుండ్రు వదిలించుకోవడానికి.. చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉల్లిపాయ నూనెను ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది మీ స్కాల్ప్ ను శుభ్రపరుస్తుంది. జుట్టును ఒత్తుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

ఇంట్లో ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలి?.. ఉల్లిపాయ నూనె చేయడానికి ముందుగా ఉల్లిపాయను మిక్సీలో వేసి అవసరాన్ని బట్టి బ్లెండ్ చేయాలి. ఆ తరువాత, పాన్లో కొబ్బరి నూనె పోయాలి. దానికి ఉల్లిపాయ పేస్ట్ జోడించండి. అది ఉడకనివ్వండి. మరిగే తర్వాత, గ్యాస్ ఆఫ్ చేయండి. ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయాలి. ప్రత్యేక డబ్బాలో తీనిని దాచి.. రోజూ వినియోగించవచ్చు.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని నిపుణుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Also read:

India Weather Report: చల్లని కబురు అందించిన భారత వాతావరణ శాఖ.. రానున్న రోజుల్లో..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్‌బీఏ పై వడ్డీని భారీగా తగ్గించిన సర్కార్..

Viral Video: ఒరే బుడ్డొడా ఏంట్రా ఇదీ.. ఒక్క దెబ్బతో చదువంతా బుర్రకెక్కాలట.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!