AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్‌బీఏ పై వడ్డీని భారీగా తగ్గించిన సర్కార్..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద శుభవార్త. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ( HBA )పై ప్రభుత్వం వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది . గృహ నిర్మాణ అడ్వాన్స్‌పై..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్‌బీఏ పై వడ్డీని భారీగా తగ్గించిన సర్కార్..
Central Govt
Shiva Prajapati
|

Updated on: Apr 15, 2022 | 5:00 AM

Share

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద శుభవార్త. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ( HBA )పై ప్రభుత్వం వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది . గృహ నిర్మాణ అడ్వాన్స్‌పై వడ్డీ రేటు 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జీవో ను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ (సిజిఎస్) హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ప్రయోజనాన్ని కేంద్రం ఇస్తున్న విషయం తెలిసిందే. 1 అక్టోబర్, 2020 న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల కోసం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ( HBA స్కీమ్ ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గృహాలను నిర్మించుకోవడానికి సరసమైన రుణాలను అందిస్తోంది.

ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగులు, 5 సంవత్సరాలు నిరంతరం పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులు ఇల్లు కొనడానికి రుణం రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని పొందుతారు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులో ఉంది. HBA కింద, ప్రభుత్వ అధికారులు తమ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి అడ్వాన్స్ పొందవచ్చు. HBA క్రింద కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం అడ్వాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అడ్వాన్స్‌ను హౌసింగ్ లోన్ డౌన్ పేమెంట్‌గా ఉపయోగించవచ్చు.

ముందుగా ఎంత తీసుకోవచ్చు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ అడ్వాన్స్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంటుంది. ఈ తగ్గింపు ఏప్రిల్ 1, 2022 నుండి మార్చి 31, 2023 వరకు 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. 7వ వేతన సంఘం, హెచ్‌బిఎ నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 నెలల బేసిక్ జీతం, గరిష్టంగా రూ. 25 లక్షలు లేదా ఇంటి ఖర్చు లేదా అడ్వాన్స్ చెల్లించే సామర్థ్యం, ఏది తక్కువైతే అది నిర్మాణం కోసం తీసుకోవచ్చు. ఒక కొత్త ఇల్లు కొనుగోలు చెయ్యవచ్చు. ముందుగా తీసుకున్న మొత్తం 180 నెలలకు ప్రిన్సిపాల్‌గా రికవరీ చేయబడుతుంది. మిగిలిన 5 సంవత్సరాలు లేదా 60 నెలలు, అది వడ్డీగా EMIలో తిరిగి పొందబడుతుంది.

షరతులు వర్తిస్తాయి.. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ అడ్వాన్స్‌ని పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. ఉదాహరణకు, సొంత స్థలంలో ఇల్లు నిర్మించాలన్నా.. ఇంటిని విస్తరించాలనుకున్నా ఈ అడ్వాన్స్‌ని తీసుకోవచ్చు. అయితే, పర్మినెంట్ ఉద్యోగి మాత్రమే దీని ప్రయోజనం పొందుతారు. ఒక తాత్కాలిక ఉద్యోగి 5 సంవత్సరాలకు పైగా నిరంతరం పనిచేసినట్లయితే, అతను ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్‌గా ప్రయోజనం పొందుతాడు.

డీఏ పెంపు.. ఇదిలాఉంటే.. ప్రభుత్వం 7వ వేతన సంఘం కింద ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచారు. ఇప్పుడు కేంద్ర ఉద్యోగులకు వారి జీతంతో పాటు 34 శాతం చొప్పున డీఏ లభిస్తుంది.

Also read:

IPL 2022: మెరిసిన హార్దిక్ పాండ్యా.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ గెలుపు..

RK Roja: కన్నీటితో జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పిన ఆర్కే రోజా.. ప్రజాసేవ కోసం తప్పడం లేదంటూ..

Charanjit Singh Channi: పంజాబ్‌ మాజీ సీఎం చన్నీకి ఈడీ ఝలక్‌.. ఇసుక మైనింగ్‌ కేసులో సుదీర్ఘ విచారణ..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..