IPL 2022: మెరిసిన హార్దిక్ పాండ్యా.. 37 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ గెలుపు..
RR vs GT: ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(GT), రాజస్తాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(GT), రాజస్తాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) విజృంభించాడు. 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. అభినవ్ మనోహర్ 28 బంతుల్లో 43(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేశాడు. డెవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 31(5 ఫోర్లు, ఒక సిక్స్)పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 13, మథ్యూ వెడ్ 12, విజయ్ శంకర్ 2 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, చాహల్, పరాగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కల్దీప్ సేన్ నాలుగు ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.
193 పరుగుల విజయలక్ష్యంతో ఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలో వికెట్ కోల్పోయింది. పడిక్కలు డకౌట్ అయ్యాడు. వన్ డౌన్‌లో వచ్చిన అశ్విన్ 8 పరుగులకే వెనుదిరిగాడు. బట్లర్ మాత్రం వీరవిహారం చేశాడు. 24 బంతుల్లో 54(8 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజ్ శాంసన్ రనౌట్ అయ్యాడు. డుస్సెన్ 6 పరుగులు చేసి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్తాన్ 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేందుకు శిమ్రన్ హెట్మేయర్ ప్రయత్నంచాడు. కానీ దాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. శిమ్రన్ 17 బంతుల్లో 29(2 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. రియన్ పరాగ్ 18, నీషమ్ 17, చాహల్5, ప్రసిద్ధ్ కృష్ణ 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఫర్గ్‌సన్, దయల్ మూడేసి వికెట్లు, పాండ్యా, షమీ ఒక్కో వికెట్ పడగొట్టారు.