AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: విజృంభించిన హార్దిక్ పాండ్యా.. 192 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్..

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్(GT), రాజస్తాన్‌ రాయల్స్(RR) మధ్య జరిగుతున్న మ్యాచ్‌లో..

IPL 2022: విజృంభించిన హార్దిక్ పాండ్యా.. 192 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్..
Panday
Srinivas Chekkilla
|

Updated on: Apr 14, 2022 | 9:28 PM

Share

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్(GT), రాజస్తాన్‌ రాయల్స్(RR) మధ్య జరిగుతున్న మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) విజృంభించాడు. 52 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టి నాటౌట్‌గా నిలిచాడు.

అభినవ్ మనోహర్ 28 బంతుల్లో 43(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేశాడు. డెవిడ్ మిల్లర్ 14 బంతుల్లో 31(5 ఫోర్లు, ఒక సిక్స్)పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్ 13, మథ్యూ వెడ్‌ 12, విజయ్ శంకర్ 2 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్‌ సేన్, చాహల్, పరాగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కల్దీప్‌ సేన్ నాలుగు ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.

Read Also.. SRH vs KKR IPL 2022 Match Prediction: మూడో విజయం కోసం హైదరాబాద్‌.. కోల్‌కతాతో పోరుకు సిద్ధం.. ఇరుజట్ల ప్లేయింగ్‌ XI ఎలా ఉండొచ్చంటే..