RK Roja: కన్నీటితో జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన ఆర్కే రోజా.. ప్రజాసేవ కోసం తప్పడం లేదంటూ..
ఇటీవల జరిగిన ఏపీ పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవిని దక్కించుకున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. పర్యాటక శాఖమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. కాగా మంత్రి వర్గంలో చోటు లభించిన వెంటనే టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక పాల్గొనను అంటూ ప్రకటించారామె.
ఇటీవల జరిగిన ఏపీ పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవిని దక్కించుకున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. పర్యాటక శాఖమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. కాగా మంత్రి వర్గంలో చోటు లభించిన వెంటనే టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక పాల్గొనను అంటూ ప్రకటించారామె. కాగా ఆమె ఇప్పటివరకు జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాను మంత్రిని కావడంతో బాధ్యతలు పెరిగాయని జబర్దస్త్ షోకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో, జబర్దస్త్ టీం సభ్యులు తమ అభిమాన నటి రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్ లో ఘనంగా సత్కరించారు. అయితే ఈ సందర్భంగా రోజా కన్నీటి పర్యంతమైంది. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్ లోనే ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తనకు సేవ చేయడం ఎంతో ఇష్టమని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశమిచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, రోజా వీడ్కోలు ఎపిసోడ్ లో యాంకర్లు, టీమ్ మెంబర్లు కంటతడి పెట్టుకున్నారు.
కాగా 2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకుల మన్ననలు పొందడంలో రోజా పాత్ర కూడా ఎంతో ఉంది. జడ్జిగా షోకు కొత్త సొబగులు అద్దడంలో ఆమె ఎంతో కృషి చేశారు. మొదట నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించిన ఆమె ఆతర్వాత సింగర్ మనోతో కలిసి షోను ముందుకు నడిపించారు. ఈక్రమంలో ఆమెపై కొన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో సమాధానం చెప్పి నోరు మూయించారు. కాగా 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. మొదట టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆపై వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి విడతలోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందని భావించినా కొన్ని సమీకరణాల కారణంగా సాధ్యం కాలేదు. చివరకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే రెండో విడతలో మాత్రం మాత్రం పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read:Charanjit Singh Channi: పంజాబ్ మాజీ సీఎం చన్నీకి ఈడీ ఝలక్.. ఇసుక మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ.. ఎడిట్ బటన్‌తో ట్విట్టర్‌తో గేమ్ స్టార్ట్ చేసిన మస్క్
Rakul Preet Singh : అందాల రకుల్‌కు అదిరిపోయే ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..