Curd: పాలు తోడు వెయ్యాలంటే పెరుగు అక్కర్లేదు.. ఇలా చేస్తే సూపర్..!

Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి పనిచేస్తుంది. పాలు ఇష్టపడని వ్యక్తులు

Curd: పాలు తోడు వెయ్యాలంటే పెరుగు అక్కర్లేదు.. ఇలా చేస్తే సూపర్..!
Curd
Follow us

|

Updated on: Apr 20, 2022 | 4:17 PM

Curd: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి పనిచేస్తుంది. పాలు ఇష్టపడని వ్యక్తులు పెరుగు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల వారి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పెరుగును అన్ని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో పెరుగు చేయడానికి తోడు అవసరమవుతుంది. కానీ ఒక్కోసారి ఇదిలేకపోయినా గడ్డకట్టే పుల్లని పెరుగు తయారచేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఎండుమిర్చి

పాలను వేలితో తట్టుకోగలిగేంత వేడి చేయండి. తరువాత రెండు ఎండుమిర్చి తీసుకొని వాటిని ఈ పాలలో వేయండి. తరువాత పాలను 2 నుంచి 4 గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచండి. పెరుగు రెడీ అవుతుంది. తర్వాత దానిని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తద్వారా అది బాగా సెట్ అవుతుంది. తర్వాత మిరపకాయను తీసి పెరుగు ఉపయోగించండి.

నిమ్మకాయ సహాయంతో

మీరు నిమ్మకాయ సహాయంతో పెరుగును తయారచేయవచ్చు. కానీ దీనికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీని కోసం గోరువెచ్చని పాలలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పాలను వెచ్చని ప్రదేశంలో ఉంచండి. దాదాపు 10 నుంచి 12 గంటల వరకు దానిని తాకవద్దు. ఆ తర్వాత పెరుగు రెడీ అవుతుంది. ఆ తర్వాత దీనిని ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది. తర్వాత తీసి వినియోగించుకోవచ్చు.

పెరుగు తయారుచేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

పెరుగును తయారుచేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దీని కోసం మీరు ఎల్లప్పుడూ పూర్తి క్రీమ్ పాలను ఉపయోగించాలి. అలాగే పాలను తక్కువ మంట మీద బాగా మరిగించాలి. తరువాత పెరుగు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రిజ్‌లో పెట్టాలి. తోడు వేసిన గిన్నెని కదిలించకూడదు. పెరుగు తోడుకున్న తర్వాత రెండు గంటలు ఫ్రిజ్లో ఉంచండి. పుల్లగా ఉండకుండా ఉంటుంది. అంతేకాదు తినడానికి రుచిగా ఉంటుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

CBSE కీలక నిర్ణయం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షలు..!

Realme Ac: ‘రియల్‌మి’ ఏసీలు వచ్చేశాయ్‌.. సరసమైన ధరలో.. అందరికి అందుబాటులో..!

Indian Railways: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడకండి..!