AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడకండి..!

Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి.

Indian Railways: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడకండి..!
uppula Raju
|

Updated on: Apr 15, 2022 | 7:42 AM

Share

Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలని గుర్తుంచుకోవాలి. మీరు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి పడేస్తుంది. వాస్తవానికి భారతీయ రైల్వే రాత్రిపూట ప్రయాణించే ప్యాసింజర్లని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిబంధనలని మార్చింది. ఇవి సాధారణంగా రైలులో ప్రయాణించే ప్రయాణికులందరికీ తెలిసి ఉండాలి. రైల్వే కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీ సీటు, కంపార్ట్‌మెంట్ లేదా కోచ్‌లో ఉన్న ప్రయాణికులెవరూ మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు. పెద్దగా సౌండ్‌ పెట్టి పాటలు వినకూడదు. తోటి ప్రయాణీకులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు.

మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల చాలా మంది ప్రయాణికులు కోచ్‌లో కొంతమంది ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడుతున్నారని లేదా అర్థరాత్రి వరకు పాటలు వింటున్నారని కంప్లెయింట్లు వచ్చాయి. రైల్వే ఎస్కార్ట్ లేదా మెయింటెనెన్స్ సిబ్బంది కూడా బిగ్గరగా మాట్లాడుతున్నారని కొంతమంది ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇది కాకుండా చాలా మంది ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత కూడా లైట్లు వేస్తున్నారని దీనివల్ల ఇతర ప్రయాణికులకి నిద్రభంగం కలుగుతుందని రైల్వే దృష్టికి వచ్చింది. వీటన్నింటిని పరిశీలించిన రైల్వే అధికారులు కొత్త నిబంధనలని రూపొందించారు. ప్రయాణికులు వీటిని పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొత్త నిబంధనలు ఏంటో తెలుసుకోండి..

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రి 10 గంటల తర్వాత మొబైల్‌లో బిగ్గరగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం రాత్రి ప్రయాణంలో బిగ్గరగా మాట్లాడకూడదు, సంగీతం వినకూడదు. ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపైనే ఉంటుంది.

TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష విధానం.. చదవాల్సిన అంశాలు.. ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందంటే..?

Good Friday 2022: నేడు గుడ్‌ఫ్రైడే.. ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా..!

Operation: ఆపరేషన్ తర్వాత చాలామంది బరువు పెరుగుతారు.. కారణం ఏంటో తెలుసా..!