Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE కీలక నిర్ణయం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షలు..!

CBSE: వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షను నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించింది. దీని ప్రకారం 10వ, 12వ బోర్డు

CBSE కీలక నిర్ణయం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షలు..!
Cbse
Follow us
uppula Raju

|

Updated on: Apr 15, 2022 | 9:43 AM

CBSE: వచ్చే విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మోడ్ పరీక్షను నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించింది. దీని ప్రకారం 10వ, 12వ బోర్డు పరీక్షలు ఒక్కసారే నిర్వహిస్తారు. అంటే టూ టర్మ్ పాలసీ రద్దవుతుంది. కరోనా మహమ్మారికి ముందు CBSE బోర్డు పరీక్షలని రెండు భాగాలుగా విభజించింది. టర్మ్-1 బోర్డ్ ఎగ్జామ్ గతేడాది నవంబర్-డిసెంబర్‌లో నిర్వహించగా, టర్మ్-2 పరీక్ష ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక సీనియర్ అధికారి ప్రకారం.. రెండు టర్మ్‌ ఎగ్జామ్స్‌ విధానం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని సీబీఎస్‌ఈ ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇప్పుడు పాఠశాలలు పూర్తిగా తెరిచామని అలాగే అన్నీ తరగతులు జరుగుతున్నాయని అందుకే ఒక్కసారి మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థుల గత పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా ఫలితాలు ప్రకటించారు.

మరోవైపు CBSE సిలబస్ గురించి మాట్లాడినట్లయితే గత రెండేళ్లలో అనుసరించిన విధానానికే కట్టుబడి ఉంది. సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. పాఠశాలలు ఉన్న పుస్తకాలను ఉపయోగించి తగ్గించిన సిలబస్‌ను బోధించవచ్చు. జాతీయ విద్యా విధానం (NEP 2020) ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థులందరినీ రెండు సందర్భాలలో బోర్డు పరీక్షలకు అనుమతించాలని ప్రతిపాదించింది. మెయిన్ పరీక్షకు ఒకటి, ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒకటి. ప్రస్తుతం NEP 2020 ప్రకారం.. X , XII తరగతులకు బోర్డు పరీక్షలు కొనసాగుతాయి.

Realme Ac: ‘రియల్‌మి’ ఏసీలు వచ్చేశాయ్‌.. సరసమైన ధరలో.. అందరికి అందుబాటులో..!

Indian Railways: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడకండి..!

TSPSC Group 1 Exam: తెలంగాణ గ్రూప్‌ 1 పరీక్ష విధానం.. చదవాల్సిన అంశాలు.. ప్రశ్నల సరళి తెలుసుకోండి..?