Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!
Russia - Ukraine War:మస్క్‌వా యుద్ధనౌక బ్లాక్‌సీలో మునిగిపోవడాన్ని సహించలేకపోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ కారణంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్
Russia – Ukraine War:మస్క్‌వా యుద్ధనౌక బ్లాక్‌సీలో మునిగిపోవడాన్ని సహించలేకపోతున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆ కారణంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని మిస్సైల్ సెంటర్‌ను ధ్వంసం చేసిన రష్యా 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకుంది. అవును, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను మళ్లీ టార్గెట్ చేసింది రష్యా. తగ్గినట్టే తగ్గిన రష్యా బలగాలు మళ్లీ విరుచుకుపడుతున్నాయి. కీవ్ శివార్ల లోని మిలటరీ స్థావరంపై రష్యా క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ తరపున పోరాడుతున్న 30 మంది పోలండ్ సైనికులు చనిపోయినట్టు రష్యా రక్షణశాఖ ప్రకటించింది.
ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా ఆక్రమించుకోవాలన్న కసితో ఉన్నారు పుతిన్. అందుకే మరోసారి యుద్దవ్యూహాన్ని మార్చారు. కీవ్‌పై ఇక చాలా శక్తివంతమైన మిస్సైళ్లను ప్రయోగిస్తామని రష్యా హెచ్చరించింది. ఇప్పటికే తాజా దాడుల్లో కీవ్ లోని మిస్సైల్ తయారీ కేంద్రం ధ్వంసమయ్యింది. చాలా ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. మూడో ప్రపంచయుద్ధం ప్రారంభమైనట్టేనని రష్యా స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. తాము కేవలం ఉక్రెయిన్‌తో మాత్రమే యుద్దం చేయడం లేదని, నాటో దేశాలతో కూడా యుధ్ధం చేస్తున్నామని రష్యా తెలిపింది. తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడులను సహించేది లేదని రష్యా హెచ్చరించింది.
ఉక్రెయిన్‌పై అంతిమయుద్దానికి సిద్దం కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యాన్ని ఆదేశించారు. రష్యా యుద్ద నౌక మస్క్‌వాను తామే పేల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించుకోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పుతిన్. ఉక్రెయిన్‌కు గట్టిగా బుద్ది చెప్పాలని రష్యా సైన్యానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ దాడిలో తమ యుద్దనౌక ధ్వంసం కాలేదని, ప్రమాదవశాత్తూ నౌకలో ఉన్న బాంబులు పేలాయని రష్యా ప్రకటించింది. ఇక కీవ్ లోని మిస్సైల్ సెంటర్ రష్యా దాడిలో ధ్వంసమయ్యింది. ఇదే సెంటర్ నుంచి ఉక్రెయిన్.. రష్యా యుద్దనౌక మస్క్‌వాపై క్షిపణులు ప్రయోగించినట్టు చెబుతున్నారు. ఈ యుద్దనౌకలో దాదాపు 559 మంది రష్యా సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యా సైనికులు చనిపోయినట్టు చెబుతుంటే.. తమ సైనికులను రక్షించినట్టు రష్యా రక్షణశాఖ తెలిపింది.
Also read:
Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి
Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..
Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొందిం..