AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉందా? దీని వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తెలుసుకోండి..

Health Care: ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కనీసం 8 గంటలు నిద్రపోవడం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

Health Care: నోరు తెరిచి నిద్రించే అలవాటు ఉందా? దీని వల్ల కలిగే ఆరోగ్య నష్టాలను తెలుసుకోండి..
Sleeping
Shiva Prajapati
|

Updated on: Apr 16, 2022 | 6:15 AM

Share

Health Care: ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కనీసం 8 గంటలు నిద్రపోవడం వలన శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. చురుకుగా ఉంటారు. రాత్రి నిద్ర శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది. అయితే, కొంతమంది బాగా నిద్రపోయినప్పటికీ.. వారికి కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. గురక పెట్టడం, నోరు తెరిచి పడుకోవడం వంటికి చేస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా నోరు తెరిచి నిద్రపోయే వారు అనేక రకాల శారీరీక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నోరు తెరిచి నిద్రపోవడం వలన గురక సమస్య పెరుగుతుందని, నిద్ర పట్టే వ్యవధి కూడా తగ్గుతుందని అంటున్నారు. మరి నో తెరిచి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దుర్వాసన.. కొన్నిసార్లు నోటి దుర్వాసన కారణంగా ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నోరు తెరిచి నిద్రపోవడం కూడా దీనికి బలమైన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోరు తెరిచి నిద్రించడం వల్ల గాలిలో ఉండే బ్యాక్టీరియా మన దంతాలు, నోటి లోపల స్థిరపడిపోతాయి. ఈ బ్యాక్టీరియా, ధూళి తరువాత దుర్వాసన కలిగిస్తాయి. ఒకవేళ మీరు కూడా నోరు తెరిచి నిద్రిస్తున్నట్లయితే.. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

దంత సమస్యలు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోరు తెరిచి పడుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. దీని వల్ల నోటిలో ఉండే లాలాజల గ్రంధులు ఎండిపోవడం మొదలవుతుందని చెబుతున్నారు. చెడు బ్యాక్టీరియాను నోట్లో వృద్ధి చేస్తుంది. ఇంకా నోటిలో పళ్ల నుంచి రక్తస్రావంతో సహా ఇతర వ్యాధులు కూడా మొదలవుతాయి.

అలసట.. నోరు తెరిచి పడుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరుపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. అలా నిద్రపోవడం వల్ల ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ప్రవాహం దెబ్బతింటుందని, రెట్టింపు బలంతో పనిచేయాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊపిరితిత్తులలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల శరీరంలో అలసట మొదలవుతుంది. ఈ అలవాటుతో బాధపడేవారు తరచుగా అలసిపోతారు.

పగిలిన పెదవులు.. నోరు తెరిచి పడుకోవడం వల్ల కలిగే నష్టాలలో ఇది కూడా ఒకటి. దీని కారణంగా పెదవులు పొడిబారడం ప్రారంభిస్తాయి. పెదవులు ఎక్కువసేపు పొడిగా ఉంటే, అవి పగుళ్లకు దారి తీస్తుంది. అంతే కాదు నోటిలోని ద్రవాలు పొడిబారడం వల్ల కూడా గొంతులో సమస్యలు మొదలవుతాయి. ప్రజలు ఒక సమయంలో ఏదైనా మింగడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఖచ్చితంగా వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Also read:

Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి

Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..

Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొంది..