Viral Video: తొండ అరటిపండును తినడం ఎప్పుడైనా చూశారా? వైరలవుతోన్న వీడియో
ముందు అరటిపండును వద్దని మారాం చేసినా.. కొద్దిగా రుచి చూసిన తరువాత.. అమాతం మింగేసింది ఓ తొండ. ఈ క్యూట్ వీడియోను షేర్ చేయడంతో.. నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Viral Video: మీరు ఎప్పుడైనా తొండ అరటిపండును తినడం చూశారా? అయితే ఈ వీడియోలో చూడండి. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ది రెప్టిల్ జూ నిర్వాహకులు ఈ వీడియోను నెట్టింట్లో వదిలారు. అసలు విషయానికి వస్తే… జూ సిబ్బంది అరటిపండును కొద్దిగా తుంచి తొండ ముందు ఉంచారు. కానీ, నేను తిననంటూ మొండికేసింది. అయినా అదే పనిగా అరటిపండును దాని దగ్గరకు తీసుకొచ్చి వాసన చూపించడంతో.. కొపం తగ్గిందేమో.. కొద్ది కొద్దిగా రుచిచూసి, నచ్చిన తరువాత అమాంతం ఒక్కసారే అరటిపండు ముక్కను తినేసింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
“మీరు ఎప్పుడైనా ఒక తొండ అరటి పండు తినడం చూశారా, ఇక్కడ చూడండి” అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ అందించారు. #Thereptilezoo, #lizard, #gecko, #lizard లాంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేసింది జూ సిబ్బంది. అయితే దీనిని ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. ఊసరవళ్లి, తొండ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో.. దాదాపు 14,000 లైకులతో దూసకపోతోంది. దీనికి ఎంతో మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. బాగుందని, కూల్ వీడియో అని కామెంట్లను చేశారు. మీరూ ఈ వీడియోను చూడండి.
View this post on Instagram
Also Read: Viral Video: కోడిపిల్లకు ముద్దుల మీద ముద్దులు పెడుతున్న కోతిపిల్ల.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి