King Cobra Viral Video: పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..
King Cobra Viral Video: వన్యప్రాణులు అంటే ఏనుగులు, పులులు, జింకలు మాత్రమే కాదు.. అటవిలో జీవించే ప్రతీ జీవి కూడా వన్యప్రాణి కిందకే..
King Cobra Viral Video: వన్యప్రాణులు అంటే ఏనుగులు, పులులు, జింకలు మాత్రమే కాదు.. అటవిలో జీవించే ప్రతీ జీవి కూడా వన్యప్రాణి కిందకే వస్తుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇప్పుడిదెందుకు చెబుతున్నామంటే.. తాజాగా కొందరు వ్యక్తులు అడవిలో కింగ్ కోబ్రాను పట్టుకుని బందించి.. దానిని చిత్రహింసలకు గురిచేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోను తమిళ నటుడు పర్వీన్ తపస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు భారీ కింగ్ కోబ్రాను తమ చేతులతో పట్టుకుని దానిని తొక్కుతూ.. గొంతు నులుముతూ ఉండటం కనిపిస్తుంది. షాకింగ్‌కు గురిచేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
వాస్తవానికి పాములంటేనే చాలా మంది భయపడుతారు. ఇక కింగ్ కోబ్రా అంటే చెప్పనక్కర్లేదు. పొరపాటు దాని కాటు బారిన పడితే క్షణాల్లో ప్రాణాలు వదలాల్సిందే. కానీ, ఈ వీడియోలో ఉన్న వ్యక్తులలో ఏమాత్రం భయం కనిపించలేదు. అదేదో చిన్న పరుగు మాదిరిగా భారీ కింగ్ కోబ్రాను పట్టేశారు. గోవాలోని ఓ రహదారి పక్కన ఉన్న అడవి పొదవల నుంచి ఇద్దరు వ్యక్తులు 12 అడుగుల మేర ఉన్న భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. ఒక వ్యక్తి దాని తలను పట్టుకోగా.. మరో వ్యక్తి దాని తోక బాగాన్ని పట్టుకుని రోడ్డుపై తీసుకువచ్చారు. మరో వ్యక్తి దానిని బందించేందుకు సంచి పట్టుకువచ్చాడు. వారి చేతికి చిక్కిన కింగ్ కోబ్రా తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. వారు మరింత పట్టుబిగించి గట్టిగా పట్టుకున్నారు. తలను అదిమిపట్టి.. పాము నడుము భాగాన్ని కాళ్ల కింద వేసి తొక్కారు. చివరికి దానిని సంచిలో బంధించి కాళ్లతో చిత్రహింసలు పెట్టారు.
ఈ వీడియోను షేర్ చేసిన పర్వీన్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అటవి, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కింగ్ కోబ్రాను బందించి హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా సీరియస్‌గానే రియాక్ట్ అవుతున్నారు. పామును బందించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. కింగ్ కోబ్రా, మోనోక్లాడ్ కోబ్రా, స్పెక్టకాల్డ్ కోబ్రా, రస్సెల్ వైపర్ వంటి పాములు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 షెడ్యూల్ 2 కింద సంరక్షించబడుతున్నాయి. ఈ సరీసృపాలను వేధించడం, హింసించం లాంటివి చేస్తే మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10 వేల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
Viral Video:
We need more #Wildlife education…I think this is a King Cobra…@ParveenKaswan @Jayanth_Sharma pic.twitter.com/sUapI13SUM
— Parvin Dabas (@parvindabas) June 22, 2021
Also read: Viral Video: తన జుట్టునే దుస్తులుగా మార్చేసిన యువతి.. చూస్తే నోరెళ్లబడెతారంటే..
Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కుండపోత వానలు
Pigeons Missing: గాల్లోకి ఎగిరిన ఎగిరిన పావురాలు మాయం..! రేసు నిర్వాహకులకు షాక్..! అసలేం జరిగింది..!
నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి