Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన జుట్టునే దుస్తులుగా మార్చేసిన యువతి.. చూస్తే నోరెళ్లబడెతారంటే..

Viral Video: పొడవాటి జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఆడవారికి పొడవైన జుట్టు ఉంటే ఆ ఆందమే వేరు.

Viral Video: తన జుట్టునే దుస్తులుగా మార్చేసిన యువతి.. చూస్తే నోరెళ్లబడెతారంటే..
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 28, 2021 | 5:50 AM

Viral Video: పొడవాటి జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఆడవారికి పొడవైన జుట్టు ఉంటే ఆ ఆందమే వేరు. అందుకే ఎంతోమంది కవులు, రచయితలు పొడవైన జుట్టుపై ఎన్నో కవితలు, పాటలు రచించారు. పాడారు. పొడవైన జుట్టు కోసం చాలా మంది రకరాల ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక రకాల నూనెలు, ఔషధాలు, ఇతరాలు వాడుతుంటారు. ఇదిలాఉంటే కొంత మంది తమ జుట్టుపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి హాట్ టాపిక్‌గా నిలుస్తారు. తాజాగా ఓ యువతి తన పొడవాటి జుట్టుతో సరికొత్త ప్రయోగం చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె చేసిన ప్రయోగం కారణంగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్‌గా నిలిచింది. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ ట్రెండింగ్ అవుతోంది.

ఎసెక్స్‌లోని బిల్లెరికేకు చెందిన 27 ఏళ్ల జోసీ.. గత 10 సంవత్సరాలుగా తన జుట్టు కత్తిరించుకోలేదు. అలా తన జుట్టును భారీగా పెంచుకుంది. పెంచుకున్న జుట్టుతో సరికొత్త ప్రయోగం చేసి స్టైల్ ఐకాన్‌గా నిలిచింది. నెత్తిన టోపీ పెట్టుకుని, సన్ గ్లాసెస్ ధరించి, ఆమె పొడవాటి జుట్టును స్టైలిష్ డ్రెస్ మాదిరిగా మార్చేసింది. గౌను మాదిరిగా జుట్టును తన శరీరం అంతా కప్పేసి.. బ్లాక్ బెల్ట్‌ను పెట్టుకుంది. ఫ్యాషన్ డిసైనింగ్ డ్రెస్ ‌లా ఉన్న హెయిర్ డ్రెస్ చూడటానికి చాలా అట్రాక్టీవ్‌గా ఉంది. కాగా, యువతి హెయిర్ డ్రెస్‌ ధరించి కెమెరాకు ఫోజులు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆమె సృజనాత్మకతకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Viral Video:

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

Also read:

Pigeons Missing: గాల్లోకి ఎగిరిన ఎగిరిన పావురాలు మాయం..! రేసు నిర్వాహకులకు షాక్..! అసలేం జరిగింది..!

Star archer Deepika: పారిస్​లో భారత్‌కు పసిడి పంట.. అదరగొట్టిన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి

కరోనా ఆస్పత్రిలో అత్యవసర వార్డులో ముగ్గురు మృతి.. ఆక్సిజన్‌ అందకనే మృతి చెందినట్లు ఓ కటుంబం ఆందోళన