Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో ముగ్గురు మృతి.. ఆక్సిజన్‌ అందకనే మృతి చెందినట్లు ఓ కుటుంబం ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కోవిడ్‌ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లు ఒకే రోజు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆక్సిజన్‌ అందకపోవడంతోనే.

కరోనా ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో ముగ్గురు మృతి.. ఆక్సిజన్‌ అందకనే మృతి చెందినట్లు ఓ కుటుంబం ఆందోళన
Follow us
Subhash Goud

|

Updated on: Jun 28, 2021 | 8:21 AM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కోవిడ్‌ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లు ఒకే రోజు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆక్సిజన్‌ అందకపోవడంతోనే వారు మృతి చెందారని ఓ మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కుమ్మరిరేవుకు చెందిన దొరబాబు (46) గత నెల 25న కరోనా బారిన పడడటంతో ఆశ్రం ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఆయనకు అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచి 20 రోజులుగా చికిత్స అందించారు. అయితే శనివారం ఎమర్జెన్సీ వార్డులో దొరబాబుతో పాటు మరో ఇద్దరు బాధితులు మరణించారు. దీంతో దొరబాబు భార్య, ఆయన కుటుంబ సభ్యులు ఆశ్రం ఆస్పత్రి ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. ఆక్సిజన్‌ నిలిచిపోవడంతోనే తన భర్త మృతి చెందాడని ఆమె ఆరోపించింది. అయితే అంతకు ముందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులకు, సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఇన్‌ఛార్జి డాక్టర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ… దొరబాబుకు నెల రోజులుగా చికిత్స అందిస్తున్నామని, ఆయనకు మధుమేహం ఉందని, కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తులు చాలా దెబ్బతిన్నాయని అన్నారు. ఇప్పటి వరకు వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందించామని, శనివారం సిబ్బంది మరో వెంటిలేటర్‌ కు మార్చారని అన్నారు. ఆక్సిజన్‌ అందకపోవడం అనేది అవాస్తవమన్నారు.

విచారణ జరిపి బాధ్యుతలపై చర్యలు తీసుకుంటాం- మంత్రి ఆళ్లనాని

ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో కోవిడ్‌ బాధితుడు దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం, ఆక్సిజన్‌ అందకపోవడం కారణమని తేలితే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఇవీ కూడా చదవండి

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి.. వెయ్యికి దిగువన పాజిటివ్ కేసులు..

Delta plus variant: తిరుపతిలో తొలి డెల్టా ప్లస్‌ కేసు.. బాధితుడి ప్రైమ‌రి కాంటాక్ట్స్ అయిన 16 మంది నుంచి శాంపిల్స్ సేక‌ర‌ణ