Star archer Deepika: పారిస్‌లో భారత్‌కు పసిడి పంట.. అదరగొట్టిన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి
India Won Gold Medal: పారిస్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత పంట పండింది. స్టార్ ఆర్చర్ దీపికా కుమారి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల రికర్వ్, మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు బంగారు పతకాలు
పారిస్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత పంట పండింది. స్టార్ ఆర్చర్ దీపికా కుమారి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల రికర్వ్, మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు బంగారు పతకాలు సాధించి పెట్టింది. మూడో ప్రపంచకప్ స్టేజ్ 3 టోర్నీలో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలతో దుమ్ము రేపింది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఉత్సాహం నింపే విజయాన్ని అందించింది.
ప్రపంచ నెంబర్ వన్ టీం కొరియా ఈ టోర్నీలో పాల్గొనలేదు. దీంతో భారత ఆర్చర్లకు పెద్ద పోటీ ఎదురు కాలేదనే చెప్పాలి. మహిళ వ్యక్తిగత, టీం, మిక్స్‌డ్ పెయిర్ విభాగాల్లో వరుసగా పసిడి పతకాలు సాధించారు. ఈ అన్ని విభాగాల్లో దీపిక ఉండడం గమనార్హం. వ్యక్తిగత విభాగంలో రష్యా ఆర్చర్ ఎలినా ఒసిపోవాపై 6-0 తేడాతో గెలుపొందింది. ప్రపంచకప్‌లో వ్యక్తిగత విభాగంలో దీపికాకు ఇది రెండో గోల్డ్ మెడల్ కాగా, ఈ రోజు మూడో స్వర్ణం.
Deepika Kumari ?? takes gold in Paris! ??? #ArcheryWorldCup pic.twitter.com/0ZIxSceCFs
— World Archery (@worldarchery) June 27, 2021
అంతకుముందు మిక్స్‌డ్ విభాగంలో దీపికా భర్త అతాను దాస్‌తో కలిసి డచ్ జంటపై విజయం సాధించింది దీపికా జోడీ. గాబ్రియేలా ష్లోసేర్, స్జెఫ్ వాన్ డెన్ బెర్గ్ జంటపై 5-3 తేడాతో గెలుపొందింది.
అంతకుముందు అభిషేక్ వర్మ కాంపౌండ్ విభాగంలో శనివారం బంగారు పతకం సాధించాడు. అలాగే మహిళల రికర్వ్ విభాగంలో దీపికా, అంకితా భకత్, కోమాలిక బరి బృందం సైతం మెక్సికో టీంపై అలవోకగా విజయం సాధించి పసిడిని సొంతం చేసుకున్నారు.