Tokyo Games: ప్రపంచ నెం.1 గా భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్.. ఇదే ర్యాంకుతో ఒలింపిక్స్ కు!
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుని బరిలోకి దిగనున్నాడు భారత బాక్సర్ అమిత్ పంగాల్. అదే ర్యాంకుతో పురుషుల 52 కిలోల ఫ్లై వెయిట్ పోటీల్లో టోక్యో ఒలింపిక్స్ 2021 బరిలో దిగనున్నాడు.
Tokyo Games: ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుని బరిలోకి దిగనున్నాడు భారత బాక్సర్ అమిత్ పంగాల్. అదే ర్యాంకుతో పురుషుల 52 కిలోల ఫ్లై వెయిట్ పోటీల్లో టోక్యో ఒలింపిక్స్ 2021 బరిలో దిగనున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ కి చెందిన బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన ర్యాక్సింగ్స్‌లో ఈ భారత్ స్టార్ తొలి స్థానంలో నిలిచాడు. దీంతో ఈ ర్యాంక్ పొంది, ఒలింపిక్స్‌కు హాజరుకానున్న మొదటి వాడు కూడా ఇతనే. అమిత్ పంగాల్ గతేడాది జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో షాఖోబిదిన్ జోయిరోవ్ (ఉజ్బెకిస్థాన్‌కు) చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలయ్యాడు. అయినా ప్రస్తుత ర్యాంకింగ్‌లో మాత్రం మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. పురుషుల ర్యాంకింగ్స్‌లో సతీష్ కుమార్ (75, 95 కిలోలు) తొమ్మిదో స్థానంలో, మనీష్ కౌశిక్ (63 కిలోలు) 18వ స్థానంలో నిలిచారు. 6సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ (69 కిలోలు) తాజా ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో కొనసాగుతోంది. సిమ్రాన్‌జిత్ కౌర్ (60 కిలోలు) 4వ స్థానంలో ఉంది. 69 కిలోల విభాగంలో లోవ్లినా బోర్గోహైన్ 5వ స్థానంలో నిలవగా.. 75 కిలోల విభాగంలో పూజా రాణి 8వ స్థానం సంపాదించింది.
కాగా, టోక్యో ఒలింపిక్స్ 2021 పోటీలు జులై 23 నుంచి మొదలుకానున్నాయి. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ పోటీల్లో భారత్ నుంచి దాదాపు 100కి పైగా ఆటగాళ్లు పోటీపడనున్నారు. తాజాగా భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. అర్హత ‘ఎ’ ప్రమాణం అందుకుని నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకుఅర్హత సాధించాడు. నిన్న ఇటలీలో జరిగిన సెట్ కోలి ట్రోఫీలో 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో ఒక నిమిషం 56.38 సెకన్లలో లక్ష్యం సాధించి ఈ అర్హత సాధించాడు. ఒక నిమిషం 56.48 సెకన్ల లోపు పోటీని ముగిస్తేనే ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే సాజన్ అంతకంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు.
కోవిడ్-19తో గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది టోక్యో లో ఒలింపిక్స్ జులై 23 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే కొందరు అథ్లెట్లు ఒలింపిక్ విలేజ్‌ను చేరుకున్నారు. అయితే, రెండు బ్యాచ్‌లుగా చేరుకున్న ఉంగాండా దేశానికి చెందిన ఇద్దరికి కోవిడ్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఒలింపిక్స్ లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది.
Also Read:
Tokyo Olympics 2021: భారత తొలి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించిన సాజన్ ప్రకాశ్