Happy Birthday Dale Steyn: దక్షిణాఫ్రికా వెటరన్‌ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్ గురించి తెలియని విషయాలు..

ప్రపంచ క్రికెట్‌లో ఫాస్ట్‌ బౌలర్లలో డేల్ స్టెయిన్ ఒకడిగా పేరు సంపాదించాడు. సుమారు 15 సంవత్సరాలు ప్రపంచ నలుమూలల బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు ఈ దక్షిణాఫ్రికా బౌలర్.

Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 11:58 AM

Happy Birthday Dale Steyn: ప్రపంచ క్రికెట్‌లో ఫాస్ట్‌ బౌలర్లలో  డేల్ స్టెయిన్... ఒకడిగా పేరు సంపాదించాడు. సుమారు 15 సంవత్సరాలు ప్రపంచ నలుమూలల బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు ఈ దక్షిణాఫ్రికా బౌలర్. తన బౌలింగ్‌ దాడితో ముప్పుతిప్పలు పెట్టాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో పరుగులు సాధించలేక బ్యాట్స్‌మెన్స్‌ ఇబ్బందిపడేవారు. అవుట్ స్వింగ్‌ తో బ్యాట్స్‌మెన్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. అద్భుతమైన వేగంలోనే కాదు.. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల సామర్థ్యం అతడితో ఉంది. దక్షిణాఫ్రికాలో ఉత్తమ ఫాస్ట్ బౌలర్‌గానే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లలో అతడు చేరాడు. నేడు తన పుట్టిన రోజు(27 June 1983)సందర్భంగా తన కెరీర్‌ను ఓ సారి పరిశీలిద్దాం..

1 / 5
డేల్ స్టెయిన్ తన బాల్యంలో స్కేటింగ్ చేసేవాడు. తన కుటుంబం ప్రిటోరియాకు చేరుకున్న తరువాత క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. 2004 సంవత్సరంలో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టెయిన్.. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడాడు. అంతకుముందు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇదే మ్యాచ్ నుంచి ఏబీ డివిలియర్స్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం విశేషం. మొదట్లో అంతగా రాణించలేకపోవడంతో.. జట్టులో స్థానం కోల్పోయాడు. ఇంగ్లీష్ కౌంటీ జట్టు ఎసెక్స్ 2 లో ఆడటం ప్రారంభించాడు.

2 / 5
2006-07 సీజన్లో.. న్యూజిలాండ్‌తో  జరిగిన మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో 16 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చేశాడు. అలాగే 2007-08లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ బాగా రాణించాడు. జోహాన్నెస్‌బర్గ్ టెస్టులో 10 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత టెస్టులో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ క్రెయిగ్ కమ్మింగ్ కు బాల్ తగలడంతో ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది.

3 / 5
2008 లో డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన వేగవంతమైన బౌలర్ గా నిలిచాడు. 18.10 సగటుతో కేవలం 14 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఈ ఏడాది ఎంపికయ్యాడు. 2010లో భారత్‌ జరిగిన ఓ మ్యాచ్‌లో 51 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

4 / 5
వయసు పెరిగే కొద్దీ డేల్ స్టెయిన్ ను గాయాలు చుట్టుముట్టాయి. 2013 నుంచి దాదాపు రెండు సంవత్సరాలు నిరంతరం గాయాలతో బాధపడ్డాడు. మొత్తంగా 93 టెస్టుల్లో 439, 125 వన్డేల్లో 196, 47 టీ 20 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు పడగొట్టాడు. అలాగే 400 టెస్ట్ వికెట్లు తీసి రిచర్డ్ హాడ్లీ రికార్డును సమం చేశాడు.

5 / 5
Follow us