- Telugu News Photo Gallery Viral photos Viral photos the strangest villages in the world things here take people by surprise
VIRAL PHOTOS : ప్రపంచంలో అత్యంత వింతైన గ్రామాలు..! ఇక్కడి విషయాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి..
VIRAL PHOTOS : అందం, పరిశుభ్రతకు సంబంధించి ప్రపంచంలో చాలా గ్రామాలు ప్రసిద్ధి చెందాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని గ్రామాల గురించి తెలుసుకుందాం.
Updated on: Jun 27, 2021 | 2:37 PM

ఈ ప్రపంచంలో కొన్ని గ్రామాలు చాలా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. కొన్ని అందం కోసం, మరికొన్ని శుభ్రత కోసం ప్రసిద్ది చెందాయి. ఈ రోజు అలాంటి కొన్ని గ్రామాల గురించి తెలుసుకుందాం. వాటి గురించి తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు.

స్పెయిన్లో జుజ్కార్ అనే గ్రామం ఉంటుంది. ఇది పూర్తిగా నీలం రంగులో ఉంటుంది. ఇక్కడ ఇల్లు కూడా నీలం రంగులో ఉంటాయి. 2011 సంవత్సరంలో 3 డి ఫిల్మ్ కోసం కొంతమంది తమ ఇళ్లను నీలం రంగులో చిత్రీకరించారని చెబుతారు. దీని తరువాత క్రమంగా గ్రామ ప్రజలందరూ తమ ఇళ్లను నీలం రంగులోకి మార్చారు.

నెదర్లాండ్స్‌లోని గీథోర్న్ గ్రామం దాని అందంతో పాటు ఒక వింత కారణంతో కూడా ప్రసిద్ది చెందింది. అసలు ఈ గ్రామంలో ఒక్క రహదారి కూడా లేదు. ఈ కారణంగా ఇక్కడ ఎటువంటి వాహనం కనిపించదు. వాస్తవానికి ఈ గ్రామం నీటి మీద ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్లినా పడవల సహాయం తీసుకుంటారు.

ఇటలీ అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇది మిలన్ నగరంలోని లోతైన లోయ దిగువన ఉన్న విగ్నెల్లా గ్రామం. ఈ గ్రామం పూర్తిగా లోయతో ఉంటుంది. శీతాకాలంలో మూడు నెలలు సూర్యరశ్మి కూడా లభించదు. దీనివల్ల ఇంజనీర్లు, వాస్తుశిల్పులు కలిసి ఒక పెద్ద అద్దం తయారు చేశారు. దీని సహాయంతో సూర్యకాంతి కిరణాలు గ్రామానికి చేరుతాయి.

ఈ గ్రామం 'వన్ కిడ్నీ విలేజ్' పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపు ప్రతి వ్యక్తికి ఒకే మూత్రపిండం ఉంటుంది. మరో కిడ్నీని తీసి విక్రయిస్తారు. ఈ గ్రామానికి 'కిడ్నీ వ్యాలీ' అని పేరు.





























