AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: 12 మామిడి పండ్లు రూ.1.2 లక్షలు.. ఆ అమ్మాయి చదువుల కష్టాలు తీరాయ్..

ముంబయికి చెందిన ఓ వ్యక్తి 12 మామిడి పండ్లను రూ. 1,20,000 లకు కొని 11 ఏళ్ల జంషెడ్పూర్ చిన్నారి కల నెరవేర్చాడు. అంటే ఒక్కో మామిడి పండుకు రూ. 10,000లు చెల్లించాడు.

Viral Photo: 12 మామిడి పండ్లు రూ.1.2 లక్షలు.. ఆ అమ్మాయి చదువుల కష్టాలు తీరాయ్..
Girl Gets 1 Lakh Above For 12 Mangoes
Venkata Chari
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 28, 2021 | 1:32 PM

Share

Jamshedpur Girl: చదువుకుందామంటే ఆర్థిక స్థోమత బాగోలేదు. ప్రస్తుతం కరోనాతో అన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించారు. పేదరికంతో బాధపడుతోన్న ఓ అమ్మాయికి, ఆన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ కొనేంత డబ్బులేదు. దీంతో మామిడిపండ్లను అమ్ముతూ కాలం వెల్లదీస్తోంది. అయితే, ఓ వ్యక్తి ఆమె వద్దనుంచి కేవలం 12 మామిడి పండ్లను కొని ఆమె ఊహించని డబ్బును అందించి, ఆమె స్వప్నాన్ని నెరవేర్చాడు. వివరాల్లోకి వెళ్తే.. జంషెడ్‌పూర్‌లోని ఓ రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న ఓ అమ్మాయి తులసిని స్థానిక ఛానల్ తో మాట్లాడుతూ… ఆన్‌లైన్‌ క్లాసులు వినాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి. కానీ, నా వద్ద అంత డబ్బులేదు. ఈ మామిడి పండ్లను అమ్మి, కుటుంబ అవసరాలకుపోగా మిగిలిన డబ్బును పొదుపు చూసుకుంటూ.. ఓ ఫోన్ కొనుక్కోవాలి అంటూ తనకు చదువుపై ఉన్న వాత్యల్యాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఇది చూసిన ఎడ్యుటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అమేయా హేటే.. ఆమె వద్దకు వచ్చి 12 మామిడి పండ్లను కొని, ఆమె తండ్రి అకౌంట్‌లోకి రూ.1,20,000లు పంపించాడు. అంటే ఒక్కో మామిడి పండును రూ. 10,000లు చెల్లించాడు. దీంతో ఆమె చదువు కష్టాలు తీరడమేకాక, కుటుంబం కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలిగింది. దీంతో అమేయా హేటేను ‘మామా’ అని ముద్దుగా పిలుస్తోంది ఆ చిన్నారి.

“అవును, నేను మామిడి పండ్లను అమ్మాను. ‘మామ’ అందించిన సహాయంతో ఆన్‌లైన్‌లో క్లాసులు వినేందుకు ఓ ఫోన్ కొనుగోలు చేశాను. క్లాసులకు హాజరవుతున్నాను” అని తులసి ఆనందంగా చెప్పుకొచ్చింది. 5వ తరగతి చదువుతున్న తులసి, కరోనాతో స్కూల్స్ మూసివేయం, ఆన్ లైన్‌ లో క్లాసులు ప్రారంభించడంతో.. ఫోన్ కొనే స్థోమత లేక చదువు మానేసింది. ఈ మేరకు హేటే మాట్లాడుతూ, కుటుంబాన్ని పోషించేందుకు తులసి చేస్తున్న పోరాటం గురించి విన్నాను. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలన్న ఆ చిన్నారి సంకల్పం ముందు నా సహాయం చాలా చిన్నది. ఆమె తన తలరాతను నింధించలేదు. భిక్ష కోరలేదు. అందుకే ఆమె వద్ద నుంచి మామిడి పండ్లను కొన్నామని, ఆమెను ప్రోత్సహించడం కోసమే చేశానని చెప్పుకొచ్చాడు.

Also Read:

Viral Video: తన హెయిర్‌నే దుస్తులుగా మార్చేసింది..? వైరలవుతోన్న వీడియో!

VIRAL VIDEO : డ్రోన్ కెమెరాను జంప్ చేసి పట్టుకున్న కుక్క..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: వీడు సామాన్యుడు కాదు.. ఏకంగా మంచం కింద పెద్ద సొరంగం తవ్వేశాడు.. వైరల్ వీడియో!