Visakhapatnam Airport: జూలై 1 నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీస్‌లు పెంపు.. ఇవిగో వివరాలు
దేశంలో టైప్ - 2 నగరాలలో విశాఖ విమానాశ్రయంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తూర్పు తీర నావికాదళానికి చెందిన విమానాశ్రయం అయినప్పటికీ, అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ...
దేశంలో టైప్ – 2 నగరాలలో విశాఖ విమానాశ్రయంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తూర్పు తీర నావికాదళానికి చెందిన విమానాశ్రయం అయినప్పటికీ, అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ జాతీయ, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ అందించే విమానాశ్రయంగా పేరు గడిస్తోంది. అయితే కరోనా ఆంక్షలతో కొద్దికాలంగా విమాన ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మాత్రం నష్టమైనప్పటికీ నామమాత్రంగా కొన్ని సర్వీసులు నడుపుతున్నాయి. ప్రస్తుతం విశాఖకు రోజూ పది విమానాలు వచ్చి వెళుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, రాయపూర్, చెన్నె, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు, కర్నూల్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ సమయం చాలా రాష్ట్రాల్లో తగ్గించడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు ముందుకు వస్తు న్నాయి.
స్పైస్‌జెట్ సంస్థ జూలై ఒకటో తేదీ నుంచి విశాఖ నుంచి ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలకు విమానం నడపనుంది. ముంబైలో ఉదయం 7.05 గంటలకు బయలుదేరే విమానం 8.30 గంటలకు విశాఖ వస్తుంది. ఇక్కడి నుంచి 8.55కి బయలుదేరి 10.55 గంటలకు కోల్‌కతా చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి 11.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి 2.00 గంటలకు బయలుదేరి 3.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 4.05 గంటలకు బయలుదేరి 5.20 గంటలకు విశాఖపట్నం వస్తుంది. ఇక్కడి నుంచి 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.25 గంటలకు చెన్నై చేరుతుంది. వీటితో పాటు రీజినల్ కనెక్టివిటీ పేరుతో కర్నూల్, విజయవాడ, తిరుపతి లతో పాటు అంతర్జాతీయ డెస్టినేషన్స్ కి సర్వీసులు నడిపేందుకు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపుతుండడం, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా రూపాంతరం చెందబోతుండడం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలో పనులు ప్రారంభించుకోనుండడంతో వైజాగ్ లో విమానయాన రంగానికి త్వరలో ఆకాశమే హద్దు కానుంది.
Also Read: లిఫ్ట్ అంటూ చెయ్యి ఎత్తుతుంది.. ఆపై మడత పెట్టేస్తుంది.. ‘కి’లేడీ ఆటకట్టించిన పోలీసులు