Vizianagaram Crime News: లిఫ్ట్ అంటూ చెయ్యి ఎత్తుతుంది.. ఆపై మడత పెట్టేస్తుంది.. ‘కి’లేడీ ఆటకట్టించిన పోలీసులు
క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతుంది. డబ్బు దోపిడీకి రకరకాల మార్గాలను అన్వేశిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా లిఫ్ట్ అడిగి.. అనంతరం బెదిరించి దోచుకుంటున్న కిలాడీ లేడీ...
క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతుంది. డబ్బు దోపిడీకి రకరకాల మార్గాలను అన్వేశిస్తున్నారు అక్రమార్కులు. తాజాగా లిఫ్ట్ అడిగి.. అనంతరం బెదిరించి దోచుకుంటున్న కిలాడీ లేడీకి బేడీలు వేశారు విజయనగరం పోలీసులు. తొలుత ఓ మార్గాన్ని ఎన్నుకోవడం.. అక్కడ మాటు వేసి లిఫ్ట్ అడిగి.. తర్వాత వారిని బెదిరించి డబ్బులు గుంజుతున్న మహిళను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలిని గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన లక్ష్మిగా ఐడెంటిఫై చేశారు. నిందితురాలు ఇటీవల వైజాగ్‌కు చెందిన ఓ వాహనదారుడిని లిఫ్ట్ అడిగింది. అనంతరం అతడిని బెదిరించి రూ.5 వేలు, గోల్డ్ రింగ్ కూడా లాగేసుకుంది. నిందితురాలు రోడ్డుపై ఒంటరిగా నిల్చొని.. అటుగా వచ్చే బైక్స్ ఆపి ఎమర్జెన్సీ పని ఉందంటూ బండెక్కేది. సగం దూరం వెళ్లిన తర్వాత డబ్బులు ఇస్తావా లేదంటే అఘాయిత్యానికి పాల్పడ్డావని కంప్లైట్ చేయాలా అంటూ బెదిరింపులకు పాల్పడేది.
ఈ ఘటనపై బాధితుడు జూన్ 21 విజయనగరం టూటౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా సాయంతో నిందితురాలిని గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. రోజువారి కూలీగా పనిచేసే లక్ష్మి లిక్కర్‌కు బానిసవడంతో బెదిరింపులకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. తల్లి లేకపోవడం, తండ్రి ఉన్నా పట్టించుకోపోవడంతో చదువులేక కూలి పనుల్లో చేరింది. తర్వాత వ్యసనాలకు బానిసయ్యిందని వెల్లడించారు. నిందితురాలు గతంలో పలు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు ఆమెపై ఎటువంటి కేసులు లేవని.. ఇదే ఫస్ట్ కేసు అని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: విల్లును విరిచి.. వధువు మనసు గెలిచి.. అచ్చం రామాయణంలో సీతారాముల లాగే