Viral News: విల్లును విరిచి.. వ‌ధువు మ‌న‌సు గెలిచి.. అచ్చం రామాయణంలో సీతారాముల లాగే

పెళ్లికి సంబంధించి ఒక్కో చోట ఒక్కో రక‌మైన ఆచారాలు, సంప్ర‌దాయాలు ఉంటాయి. తాజాగా బిహార్​, సారన్​ జిల్లాలోని సాబల్​పుర గ్రామంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుంది.

Viral News: విల్లును విరిచి.. వ‌ధువు మ‌న‌సు గెలిచి.. అచ్చం రామాయణంలో సీతారాముల లాగే
Marriage In Ramayana Format
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 27, 2021 | 1:11 PM

పెళ్లికి సంబంధించి ఒక్కో చోట ఒక్కో రక‌మైన ఆచారాలు, సంప్ర‌దాయాలు ఉంటాయి. తాజాగా బిహార్​, సారన్​ జిల్లాలోని సాబల్​పుర గ్రామంలో ఓ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుంది. ఇతిహాసాల్లోని ఆచారాలు పాటిస్తూ పెళ్లి తంతు పూర్తి చేశారు. రామాయణంలో సీతారాముల లాగే పెళ్లి చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మున్షీ రాయ్​ కుమార్తె ప్రియాంక కుమారి వివాహం అహ్మద్​పుర్​కు చెందిన ధర్మానాథ్​ రాయ్​ కుమారుడు అర్జున్​ కుమార్​తో నిశ్చయించారు పెద్ద‌లు. వేడుకలో భాగంగా ముందుగా వరున్ని బంధువులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. టీ, టిఫిన్లు ముగిసిన అనంతరం ధనస్సు స్వయంవరం ఏర్పాటు చేశారు. వరుడు పెళ్లి మండపం చేరగానే.. రాముడు విల్లుని విరిచిన సంద‌ర్భాన్ని పండితులు కి తెలిపారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన‌ విల్లుని విరచడానికి వెళ్తుండగా.. వరునిపై అక్క‌డ ఉన్న‌వారు పూల వర్షం కురిపించారు. ఆపై వరుడు ధనస్సును చేతపట్టి విల్లుని విరిచాడు. పూల వర్షం కురుస్తుండగా.. వధువు మండపం పైకి వచ్చింది. వరుడు వరమాలను ఆమె మెడలో వేశాడు. రామాయణంలో సీతారాముల కల్యాణంలాగే జ‌రిగిన ఈ పెళ్లి తంతు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినా.. ఈ పెళ్లిలో మాత్రం భారీగా అతిథులు పాల్గొన్నారు. భౌతిక దూరాన్ని పాటించలేదు. మాస్క్ ధ‌రించిన వాళ్లు కూడా పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం 25 మంది మాత్రమే పెళ్లిలో పాల్గొనాలి. దీంతో అధికారులు వేడుక నిర్వ‌హించిన పెద్ద‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యారు.

Also Read: పోసాని శవం దగ్గర ధనుష్ సాంగ్ కు ఓ రేంజ్ లో చిందేసిన నందిని రాయ్.. వీడియో వైరల్

చిత్తూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లతో గొర్రెల కాపరిని మోసం చేసిన ముఠా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!