Fake currency : చిత్తూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లతో గొర్రెల కాపరిని మోసం చేసిన ముఠా

చిత్తూరు జిల్లాలో నకిలీ నోట్లతో గెర్రెల కాపరికి టోకరా వేసింది ఒక ముఠా. కెవిబి పురం మండలం కొత్తూరుకు చెందిన మునిరెడ్డి అనే గొర్రెల కాపరికి నకిలీ నోట్లు..

Fake currency : చిత్తూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లతో గొర్రెల కాపరిని మోసం చేసిన ముఠా
Sheep
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 27, 2021 | 9:16 AM

Fake counterfeit currency cheating : చిత్తూరు జిల్లాలో నకిలీ నోట్లతో గెర్రెల కాపరికి టోకరా వేసింది ఒక ముఠా. కెవిబి పురం మండలం కొత్తూరుకు చెందిన మునిరెడ్డి అనే గొర్రెల కాపరికి నకిలీ నోట్లు ఎరచూపి సులువుగా మోసం చేసింది. వివరాల్లోకి వెళితే, శ్రీకాళహస్తి పిచ్చాటూరు మార్గంలో గొర్రెలు, మేకలు మేపుతున్నాడు మునిరెడ్డి. అదే సమయంలో అటువైపు ఆటోలో వెళుతూ ఒక మహిళ, ఒక వ్యక్తి గొర్రెల కాపరి మీద కన్నేశారు.

మునిరెడ్డిని మాటల్లోకి దింపి దొంగ నోట్లు ఇచ్చి 2 మేక పోతులను కొనుగోలు చేశారు. అయితే, ఆతర్వాత అవి దొంగనోట్లని తేలడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతులిద్దరి గురించి ఆరా తీస్తున్నారు.

కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది

కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం చిన్న కోట్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుక్క కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమవడం విశేషం. వివరాల్లోకి వెళితే, స్థానికంగా నివసించే బాల నరసింహులు అనే వ్యక్తి తన పై మరుగుతుందంటూ ఒక పెంపుడు కుక్కని కొట్టాడు. అయితే..

తమ కుక్కని ఎందుకు కొడతావంటూ.. ప్రతీకారంగా నరసింహులు పై కుక్క యజమాని దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో కుక్క యజమాని దాడి చేయడంతో తీవ్ర గాయాలైన నర్సింహులు చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నరసింహులు మృతికి కారణమైన కుక్క యజమానిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Read also : Dog dispute : కుక్క అరుపులు తెచ్చిన తంటా.. ఒక నిండు ప్రాణాన్ని చంపింది. !