AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..!

నాలుగేళ్ల సైనిక సేవ అనంతరం అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని కల్పించింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో సేవలు పూర్తి చేసిన మాజీ అగ్నివీరులు కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో (CAPF) చేరేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మాజీ అగ్నివీరులకు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్‌మ్యాన్ పోస్టుల్లో 50 శాతం ఖాళీలను కేటాయించనున్నట్లు తెలిపింది.

CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..!
Central Armed Police Forces
Balaraju Goud
|

Updated on: Jul 22, 2026 | 6:08 PM

Share

నాలుగేళ్ల సైనిక సేవ అనంతరం అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని కల్పించింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో సేవలు పూర్తి చేసిన మాజీ అగ్నివీరులు కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో (CAPF) చేరేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మాజీ అగ్నివీరులకు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్‌మ్యాన్ పోస్టుల్లో 50 శాతం ఖాళీలను కేటాయించనున్నట్లు తెలిపింది.

బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరిన యువతకు నాలుగేళ్ల సేవ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు.

కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB), అస్సాం రైఫిల్స్ వంటి దళాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ స్థాయి నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 50 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇది సాధారణ ప్రాధాన్యత కాదని, నియామక నిబంధనల్లో భాగంగా అమలు చేసే ప్రత్యేక రిజర్వేషన్ అని పేర్కొంది.

అంతేకాకుండా మాజీ అగ్నివీరులకు వయోపరిమితిలో కూడా సడలింపులు కల్పించారు. సాధారణ గరిష్ఠ వయోపరిమితికి అదనంగా మూడు సంవత్సరాల సడలింపు ఇవ్వనున్నారు. అగ్నిపథ్ ప్రారంభ దశలో చేరిన తొలి బ్యాచ్ అగ్నివీరులకు మాత్రం అదనంగా మరో ఐదేళ్ల వయో సడలింపు కల్పించనున్నారు. ఈ ప్రత్యేక అవకాశం ఒక్కసారి మాత్రమే వర్తించనుంది.

మరో కీలక అంశంగా, మాజీ అగ్నివీరులకు CAPF నియామకాల్లో రాత పరీక్షతో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసిన అనుభవం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ ఆధారంగా వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హోంశాఖ పరిధిలో మాజీ అగ్నివీరుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. సైనిక సేవ పూర్తయిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలు, వివిధ దళాల్లో నియామక ప్రక్రియలపై సమన్వయం చేయడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంది.

తాజాగా కేంద్రం ప్రకటించిన 50 శాతం కోటా, వయో సడలింపులు, పరీక్షల మినహాయింపులు ఈ హామీలకు స్పష్టమైన రూపం ఇచ్చినట్లు భావిస్తున్నారు. అయితే రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో అగ్నివీరులు సేవలు పూర్తి చేసిన తర్వాత ఈ విధానం ఎంత సమర్థవంతంగా అమలవుతుందనేది కీలకంగా మారనుంది. ప్రభుత్వం రూపొందించిన ఈ చట్రం కాగితాలపై ఎంత బలంగా ఉన్నా, వాస్తవ నియామకాలలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!
భూమి కొనేముందు.. ఈ నిజాలు తెలియకపోతే..నష్టపోతారు!