చామంతి కుప్పలు కుప్పలుగా పూయాలా.. ఈ చిట్కాలు మీ కోసం

Samatha

22 July 2026

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంటిలో రక రకాల పూల మొక్కలు పెట్టుకుంటారు. ముఖ్యంగా గులాబీ, చామంతి పూలు ఎక్కువగా పెట్టుకుంటారు.

వర్షాకాలం

అయితే చామంతి పూలు చెట్టు నిండుగా పూలు పూయాలి అంటే, చెట్టు నాటే క్రమంలోనే కొన్ని నియమాలు పాటించాలంట.

చెట్టు నిండా పూలు

చామంతి పూలు విరగబూయాలి అంటే తప్పకుండా  మంచిగా ఎండ తగిలే చోట మొక్కను నాటుకోవాలి. అప్పుడే పూలు నిండుగా పూస్తాయి.

ఎండ తగిలే చోట

చామంతి మొక్కలు నాటే క్రమంలోనే, ఇసుక, కొబ్బరి పీచు, ఆవు పేడ వేసుకోవాలి. అప్పుడే చెట్టు నిండుగా పూలు పూస్తుంది.

కొబ్బరి పీచు, ఆశుపేడ

అంతే కాకుండా చెట్టు వద్ద ఎక్కువగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. చెట్టు వద్ద నీరు ఉంటే, మొక్క పూలు ఎక్కువగా పూయవు.

నీరు నిల్వ

ఆకులు పెరిగే టైమ్‌లో తప్పకుండా  ఆవు పేడ, టీ పెట్టుకున్న తర్వాత మిగిలిన పొడి వేసుకోవాలి. అప్పుడే చెట్టు నిండుగా పూస్తుంది.

టీ, పొడి పౌడర్

అంతే కాకుండా చామంతి మొక్క మొగ్గలు వేసే సమయంలో, పొటాష్, ఫాస్పరస్, వేయాలి. దీని వలన మొగ్గలు ఎక్కువగా వేస్తుంది.

పొటాష్ ఫాస్పరస్

ఎప్పుడూ కూడా మట్టి ఆరిన తర్వాతే నీళ్లు పోయాలి. దీని వలన చెట్టు నిండుగా మొగ్గలు వేసి,కుప్పలు కుప్పలుగా పూలు పూస్తుంది.

నీళ్లు పోయడం