AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : డ్రోన్ కెమెరాను జంప్ చేసి పట్టుకున్న కుక్క..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

VIRAL VIDEO : జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తాయి. ఈ వీడియోలలో కొన్ని అందమైనవి, మరికొన్ని

VIRAL VIDEO : డ్రోన్ కెమెరాను జంప్ చేసి పట్టుకున్న కుక్క..! సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..
Dog Attack On Drone
uppula Raju
|

Updated on: Jun 26, 2021 | 8:56 PM

Share

VIRAL VIDEO : జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తాయి. ఈ వీడియోలలో కొన్ని అందమైనవి, మరికొన్ని భయంకరమైనవి ఉంటాయి. కొన్నిటిని జనాలు మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడుతారు. అదే సమయంలో కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరమైనవి. వాటిని చూసినప్పుడు గగుర్పాటుకు గురవుతారు. అయితే కొన్ని వీడియోలను నమ్మడం కష్టంగా ఉంటుంది. తాజాగా ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ వీడియో చూస్తే మీరు నోరెళ్లబెడతారు.

కుక్క చాలా నమ్మకమైన జంతువు అని అందరికి తెలుసు. కుక్కను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు కుక్క కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. శత్రువుపై ఊహించని దాడి చేస్తుంది. కానీ ఈ వీడియోలో డ్రోన్ కెమెరాపై కుక్క ఎగిరి మరీ దాడి చేస్తుంది. అది ఎగిరిన తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు వీడియోలో చూసినట్లుగా కుక్కను డ్రోన్ కెమెరా పర్యవేక్షిస్తోంది. అప్పుడు  ఈ జర్మన్ షెపర్డ్ బౌన్స్ ఎగిరి డ్రోన్‌ను దాని దవడ ద్వారా పట్టుకుని కిందకు పడేస్తుంది.

షాకింగ్ వీడియో వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపడి ఉంటారు. కుక్కకు అలాంటి రూపం ఉండటం కూడా మీరు ఇంతకు ముందు చూడకపోవచ్చు. ఈ వీడియోను ‘ఫ్రెడ్ షుల్ట్జ్’ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు 15 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. ఈ వీడియోను చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండగా, వన్యప్రాణి ప్రేమికులు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ప్రజలు కూడా దీనిపై ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

Inflation: పాకిస్తాన్ లో కిలో చక్కర 110 రూపాయలు..భారత్ నుంచి దిగుమతులు లేకనే..ఏం జరిగింది? ఏం జరగొచ్చు?

BJP Mission 2022: వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు టార్గెట్.. ఇమేజ్ బూస్టర్‌పై కమలనాథుల ఫోకస్

Adityanath Das: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం పొడిగింపు.. ఎప్పటివరకంటే..?