Adityanath Das: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
AP CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించారు. 2021

AP CS Adityanath Das: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించారు. 2021 సెప్టెంబరు 30 వరకు ఆయన సర్వీసును కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్‌దాస్ జూన్ 30తో పదవీవిరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సర్వీసును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన పలు శాఖల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
Also Read: