Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TPCC President: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితుల‌య్యారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది.

TPCC President: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం
Revanth Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2021 | 8:51 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితుల‌య్యారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌‌లను నియ‌మించింది. ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

త‌మ‌కే పీసీపీ ప‌గ్గాలు కావాలంటూ చాలామంది రకాల ప్రయత్నాలు జరిగినా..రేవంత్ ఢిల్లీ కేంద్రంగా త‌న మార్క్ ప్ర‌య‌త్నాలు చేశారు. చివరి వరకు రేవంత్ రెడ్డికి పోటీగా ముగ్గురు పేర్లు రేసులో ఉన్నాయి. అందులో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. అయితే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ మాత్రమే సమర్ధుడనే క్యాడ‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌ల నుంచి సంకేతాలు ఢిల్లీ అధినాయ‌క‌త్వానికి వెళ్లాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో రేవంత్ వైపే కాంగ్రెస్ పెద్ద‌లు మొగ్గు చూపారు.

2023 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ను తెలంగాణలోకి అధికారంలోకి తీసుకొస్తానని.. కొందరు పని కట్టుకొని చేసే ఫిర్యాదులను పట్టించుకోకుండా తనకు కాస్త స్పేస్ ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కోరిన‌ట్లు సమాచారం.

Also Read: ప‌ల్లె ప్ర‌గ‌తి, పట్టణ ప్రగతికి భారీగా నిధుల కేటాయింపు.. జిల్లాకు కోటి చొప్పున మంజూరు..

 ‘కొత్త జంటల శోభనానికి పనికిరావు’…జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్