Bay Leaves: నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి

Bay Leaves: బిర్యానీలో మంచి వాసన కోసం వాడే ఈ ఆకుని కొంతమంది తేజ్ పత్తా గా పిలుస్తారు. ఘాటైన సువాసన ఉండడంచేత బిర్యానీ లేదా పులావ్ లోని ముఖ్య పదార్ధాలలో..

Bay Leaves: నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి
Bay Of Leaves
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2021 | 10:12 AM

Bay Leaves: బిర్యానీలో మంచి వాసన కోసం వాడే ఈ ఆకుని కొంతమంది తేజ్ పత్తా గా పిలుస్తారు. ఘాటైన సువాసన ఉండడంచేత బిర్యానీ లేదా పులావ్ లోని ముఖ్య పదార్ధాలలో ఒకటిగా నిలిచింది. నిజానికి ఈ ఆకును బిర్యానీలో తప్ప మిగతా వంటకాల్లో ఉపయోగించారని చెప్పవచ్చు. అయితే ఈ ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోగాలున్నాయి. అందుకని తరచుగా ఈ ఆకుని ఉపయోగించడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

*ఈ ఆకు అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు.

*శ్వాసకోశ వ్యవస్థ ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ‘ఇంటర్‌ల్యూకిన్‌’ అనే ప్రొటీన్‌ను వ్యాధినిరోధక వ్యవస్థ స్వల్ప పరిమాణాల్లో విడుదల చేస్తూ ఉంటుంది. బిరియానీ ఆకు తరచుగా తీసుకుంటే ఈ ప్రొటీన్‌ విడుదల తగ్గుతుంది.

*చెడు కొలెస్ట్రాల్‌, చక్కెరలను తగ్గించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ తయారయ్యేలా బిరియానీ ఆకు తోడ్పడుతుంది.

*ఈ బిరియాని ఆకు మమధుమేహం నియంత్రణకు ఉపయోగపడుతుంది. మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది ఉపయోగపడుతుంది.

*తరచుగా వంటకాల్లో బిరియానీ ఆకు వాడడం వల్ల కొన్ని రకాల కేన్సర్‌లు, ప్రధానంగా ‘కోలోరెక్టల్‌’ కేన్సర్‌ ముప్పు తప్పుతుంది.

*ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బే ఆకులని నీళ్లలో కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. లేదా నిద్రపోయే సమయంలో దిండు పక్కనే తువ్వాలు మీద రెండు చుక్కల బే లీఫ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి పడుకుంటే, మంచి నిద్ర పట్టడంతో పాటు, ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో నిద్ర లేస్తారు.

*బిరియానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడడం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు.

*బిరియానీ ఆకులో ఒత్తిడిని తొలగించే గుణాలు ఉన్నాయి. కనుకనే ఆరోమాథెరపీలో భాగంగా దీనిని ఉంటారు. కాబట్టి ఒత్తిడిగా అనిపిస్తే బాగా ఎండిన బిరియానీ ఆకును కాల్చి, వాసన పీల్చాలి. గది తలుపులు మూసి, ఓ గిన్నెలో బిరియానీ ఆకును కాల్చాలి. అప్పుడు పల్చని పొగతో పాటు, సువాసన గది మొత్తం అలముకుంటుంది. ఈ వాసనను పీల్చడం వల్ల మనసు నెమ్మదించి, ఒత్తిడి తొలగిపోతుంది.

Also Read: శ్రీవారి వివాహం అనంతరం కొలువుదీరిన ఆలయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం

పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!