NBT Young Writers: దేశంలోని యువ రచయితలకు సదవకాశం.. నెలకు రూ. 50 వేలు ఉపకార వేతనం పొందే అవకాశం.
NBT Young Writers: మీకు రైటింగ్ అంటే ఆసక్తా.. పలు అంశాలపై బాగా రాయగలరా..? అయితే ఈ సదవకాశం మీకోసమే. దేశంలో ఉన్న యువ రచయితల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. యంగ్ రైటర్స్‌ను...
NBT Young Writers: మీకు రైటింగ్ అంటే ఆసక్తా.. పలు అంశాలపై బాగా రాయగలరా..? అయితే ఈ సదవకాశం మీకోసమే. దేశంలో ఉన్న యువ రచయితల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. యంగ్ రైటర్స్‌ను ప్రోత్సహించే క్రమంలో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లలోపు యువత నుంచి రచనలను ఆహ్వానిస్తున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇలా రచనలను పంపిన వారిలో 75 మందిని ఎంపిక చేసి.. నెలకు రూ.50 వేల చొప్పున ఆరు నెలలు ప్రధానమంత్రి ఉపకార వేతనం అందజేస్తారు.
ఎలా పంపించాలంటే…
* ఆసక్తి కలిగిన యంగ్ రచయితలు.. అన్‌సంగ్ హీరోలు, స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయోధ్యంపై రచనలు చేయాల్సి ఉంటుంది. * తమ రచనలను జులై 31, 2021లోపు సంబంధిత సంస్థకు పంపించాలి. * దేశంలోని 22 అధికార భాషలతోపాటు ఇంగ్లిష్‌లోనూ రచనలు రాయొచ్చు. * మను స్క్రిప్ట్‌లో 5వేల పదాలకు మించకుండా రాసి పంపించాల్సి ఉంటుంది. * ఎంపికైన రచయితలను ఆగస్టు 15న ప్రకటిస్తారు. * ఎంపికైన రచనలను శిక్షకుల ఆధ్వర్యంలో పుస్తకాలుగా రూపొందిస్తారు. వాటిని జనవరి 12, 2022 యువజన దినోత్సవం నాడు ఆవిష్కరిస్తారు. * పూర్తి వివరాలకోసం https://nbtindia.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Minister Harish Rao: రైతు అవతారం ఎత్తిన మంత్రి హరీష్ రావు.. స్వయంగా పొలంలో దిగి..
Weight Loss : బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..! పరగడుపున బీట్‌రూట్ డిటాక్స్ పానీయం తాగండి..